ఢిల్లీలోని ఐకానిక్ రెస్టారెంట్‌లో రాహుల్ గాంధీ ఫ్యామిలీ భోజనం.. ఫొటోలు వైరల్

రాహుల్, ప్రియాంక వెంట వారి తల్లి సోనియా గాంధీ, ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, కూతురు మిరాయా వాద్రా, ఆమె అత్తయ్య కూడా ఉన్నారు.

ఢిల్లీలోని ఐకానిక్ రెస్టారెంట్‌లో రాహుల్ గాంధీ ఫ్యామిలీ భోజనం.. ఫొటోలు వైరల్

Updated On : December 22, 2024 / 9:46 PM IST

లోక్‌సభ ఎన్నికల నుంచి ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల వరకు, ఆ తర్వాత పార్లమెంటు సమావేశాల్లో ఎంతో బిజీగా కనపడ్డారు కాంగ్రెస్‌ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ. ప్రస్తుతం కాస్త సమయం దొరకడంతో వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇవాళ ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లో లంచ్ చేశారు.

రాహుల్ గాంధీ కుటుంబం మొత్తం క్వాలిటీ రెస్టారెంట్‌లో పలు రకాల వంటకాలను రుచిచూసింది. ఈ ఫొటోలను రాహుల్ గాంధీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

రాహుల్, ప్రియాంక వెంట వారి తల్లి సోనియా గాంధీ, ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, కూతురు మిరాయా వాద్రా, ఆమె అత్తయ్య కూడా ఉన్నారు. రాహుల్ గాంధీ, అతని సోదరి ప్రియాంక రాయ్ బరేలీ, వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

Video: చాలా మంచి పెంగ్విన్‌.. ప్రేమికులను డిస్టర్బ్‌ చేయకుండా ఈ పెంగ్విన్‌ ఏం చేసిందో చూడండి