Nirmala Sitharaman: ముందు డెటాల్‭తో మీ నోరు కడుక్కోండి.. అవినీతిపై కాంగ్రెస్‭కు చురకలు అంటించిన నిర్మలా సీతారామన్

రాజస్థాన్ రాష్ట్రంలో ఫిబ్రవరి 10న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థికమంత్రి హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ ఏడాది బడ్జెట్ (2023-24) కాకుండా పోయిన సంవత్సరం బడ్జెట్ (2022-23) పేపర్లు చదివారు గెహ్లాట్. ఇలా 7 నిమిషాల పాటు పాత బడ్జెట్ పేపర్లు చదివారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నేత, వెనకాల నుంచి గెహ్లాట్ భుజం తట్టి ‘పోయిన ఏడాది బడ్జెట్ అది’ అని చెప్పే వరకు గెహ్లాట్ పసిగట్టలేదు

Nirmala Sitharaman: ముందు డెటాల్‭తో మీ నోరు కడుక్కోండి.. అవినీతిపై కాంగ్రెస్‭కు చురకలు అంటించిన నిర్మలా సీతారామన్

Rinse Your Mouth With Dettol says FM Sitharaman Jabs Congress Over Corruption

Updated On : February 11, 2023 / 9:15 AM IST

Nirmala Sitharaman: కేంద్ర బడ్జెట్ మీద కాంగ్రెస్ నేతలు గుప్పిస్తున్న విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పి కొట్టారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం బడ్జెట్ ప్రవేశ పెట్టే సందర్భంలో గత సంవత్సరం బడ్జెట్ కాపీలు చదవడాన్ని ఊటంకిస్తూ ‘‘ముందు డెటాల్‭తో మీ నోరు కడుక్కోండి’’ అంటూ చురకలు అంటించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. అయితే ఆ బడ్జెట్‭లో ఏమాత్రం పస లేదంటూ కాంగ్రెస్ విమర్శిస్తోంది. కార్పొరేట్లకు మేలు చేసే బడ్జెటని, దేశంలోని సగటు పౌరుడికి ఏమాత్రం ఉపయోగడపడదంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడుతున్నాయి.

Adani-Hindenburg Row: అదాని, హిండెన్‌బ‌ర్గ్ నివేదిక వివాదంపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు.. సెబీ, కేంద్రానికి కీల‌క సూచ‌న‌లు

ఇక దీనితో పాటు, దేశంలోని ఆస్తులను కార్పరొట్లకు ప్రభుత్వం దోచి పెడుతోందనే ఆరోపణలు విపక్షలు బలంగా చేస్తున్నాయి. నిర్మలా బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలోనే ‘అదానీ’ అంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. అనంతరం ఈ విషయమై పార్లమెంటులో ప్రతిరోజు ఏదో ఒక హైడ్రామా కొనసాగుతోంది. ఈ విషయమై ఇంతకు ముందు పెద్దగ స్పందించని నిర్మల.. తాజాగా గెహ్లాట్ తప్పిదాన్ని ఊటంకిస్తూ ‘‘రాజస్థాన్ ప్రభుత్వంతో కొంచెం సమస్యగా ఉంది. పోయిన ఏడాది బడ్జెట్ ఇప్పుడు చదవడం ఏంటి? ఇలాంటి తప్పిదాలు జరగొద్దని దేవుడిని రోజూ ప్రార్థిస్తాను. కానీ ఏం చేస్తాం? జరిగిపోయింది. నేను దీని గురించి మాట్లాడదల్చుకోలేదు’’ అని అన్నారు.

PM Modi Can Stop War: ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపగలిగే శక్తి మోదీకి ఉంది.. అమెరికా

రాజస్థాన్ రాష్ట్రంలో ఫిబ్రవరి 10న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థికమంత్రి హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ ఏడాది బడ్జెట్ (2023-24) కాకుండా పోయిన సంవత్సరం బడ్జెట్ (2022-23) పేపర్లు చదివారు గెహ్లాట్. ఇలా 7 నిమిషాల పాటు పాత బడ్జెట్ పేపర్లు చదివారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నేత, వెనకాల నుంచి గెహ్లాట్ భుజం తట్టి ‘పోయిన ఏడాది బడ్జెట్ అది’ అని చెప్పే వరకు గెహ్లాట్ పసిగట్టలేదు. ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రతులు చుదువుతూ 2022-23 బడ్జెట్‭లోని రెండు ప్రకటనలు చేయగానే ప్రతిపక్షాలు రచ్చ చేయడం ప్రారంభించాయి. సభ వెల్‌లోకి దూసుకుపోయి హంగామా చేశారు విపక్ష నేతలు. స్పీకర్ సి.పి. జోషి జోక్యం చేసుకుని ఆర్డర్‌ను కొనసాగించాలని కోరినప్పటికీ విపక్షాలు వినిపించుకోలేదు. దీంతో సభ అరగంట పాటు వాయిదా పడింది.