చెన్నైలో 15 కార్లపైకి దూసుకెళ్లిన లారీ… ఆరుగురు మృతి

road accident in chennai six people killed : చెన్నైలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ధర్మపురి జిల్లాలో బెంగళూరు హైవేపై కార్లపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంలో 15 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
సేలం..బెంగళూరు జాతీయ రహదారిపై లారీ అదుపు తప్పి కార్లపైకి దూసుకెళ్లింది. దీంతో 15 కార్లు, బైక్ పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 6 మంది మృతి చెందారు. మరో 15 మందికి తవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స కోసం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఎదురుగుగా వస్తున్న ప్రతి వాహనాన్ని ఢీకొడుతూ ముందుకెళ్లింది. కానీ
ప్రమాదం తీవ్రత చూస్తే ఒళ్లు గగుర్పాటు కలిగిస్తోంది. ఒక వాహనం మీద మరో వాహనం ఎక్కాయి. ఘటనాస్థలానికి ధర్మపురి జిల్లా కలెక్టర్ తోపాటు అధికార యంత్రాంగం చేరుకుంది.
ఇప్పటికే ఆరుగురు ఘటనాస్థలంలోనే విగతజీవులయ్యాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. గాయపడిన వారిలో కాళ్లు, చేతులు విరిగిన వారు చాలా మంది ఉన్నారు. వీరికి ధర్మపురి ఆస్పత్రిలో చికిత్స అందస్తున్నారు.
బ్రిడ్జీ మీదికి వెళ్లిన తర్వాత బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయని, అదుపుచేయలేకపోయానని లారీ డ్రైవర్ చెప్పారు. అటు ఇటు వెళ్లలేని పరిస్థితుల్లో నేరుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టాల్సివచ్చిందని తెలిపారు.