Viral Video: అన్ని గంటలపాటు కష్టపడి ఆటోనడిపితే.. ఇంతే డబ్బు వచ్చింది.. ఎందుకంటే?: ఆటోడ్రైవర్ కన్నీరు

ఉచితాలకు ఆశపడి ప్రజలు ఓట్లు వేశారని, దాని ప్రతికూల ప్రభావం నేరుగానూ, పరోక్షంగానూ కనపడుతోందని ఈ వీడియోపై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Viral Video: అన్ని గంటలపాటు కష్టపడి ఆటోనడిపితే.. ఇంతే డబ్బు వచ్చింది.. ఎందుకంటే?: ఆటోడ్రైవర్ కన్నీరు

Auto Drivers

Updated On : June 28, 2023 / 6:06 PM IST

Viral Video – Bengaluru: ఏ నగరంలోనైనా సరే ఆటో ఎక్కే ప్రయాణికులు లేకపోతే వందలాది మంది ఆటోడ్రైవర్ల కుటుంబాలు పస్తులు ఉండాల్సిందే. ఒక్కరోజు ప్రయాణికులు కరవైతేనే ఎన్నో ఇబ్బందులు పడతారు ఆటోడ్రైవర్లు. అటువంటిది బెంగళూరులో కొన్ని రోజులుగా చాలా మంది ఆటోలు ఎక్కడం లేదు. దీంతో ఆటోడ్రైవర్ల బాధలు వర్ణనాతీతంగా మారాయి.

కర్ణాటక(Karnataka) లోని అన్ని ప్రాంతాల్లో ఆర్డినరీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేసే అవకాశాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దీంతో ఆటో ఎక్కే మహిళల సంఖ్య భారీగా పడిపోయింది. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడినా ఆటోడ్రైర్లకు కనీసం రూ.100 కూడా రావడం లేదు.

కుటుంబాన్ని ఎలా పోషించాలంటూ ఓ ఆటోడ్రైవర్ ఆవేదన చెందాడు.  పరిస్థితుల్లో బెంగళూరు ఆటోడ్రైవర్‌కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆటోనడిపానని అయినప్పటికీ తనకు రూ.40 మాత్రమే వచ్చిందని ఆ ఆటోడ్రైవర్ స్థానిక కన్నడ మీడియాకు చెప్పాడు.

ఉచితాలకు ఆశపడి ప్రజలు ఓట్లు వేశారని, దాని ప్రతికూల ప్రభావం నేరుగానూ, పరోక్షంగానూ కనపడుతోందని ఈ వీడియోపై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మహిళలతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయని, పురుషులు బస్సుల్లో నుంచి బయటకు ఎలా వస్తారు? బస్సులు ఎలా ఎక్కుతారని మరో యూజర్ కామెంట్ చేశాడు.

Viral Video: అమ్మాయిలను సినిమాల్లో హీరోలు కాపాడతారు.. నిజ జీవితంలో ఇతడు.. నడిరోడ్డుపై ఫైట్ చేసి..