భారత్‌లో ఉగ్రదాడి హెచ్చరికలు : టాప్‌లిస్ట్‌లో RSS నేతలు

భారతదేశంలో ఉగ్రవాదులు చొరబడ్డారని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. పీవోకే నుంచి భారతదేశంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారని హెచ్చరించాయి. దీంతో కేంద్ర హోం శాఖ స్పెషల్ సెల్ పోలీసులను అప్రమత్తం చేసింది. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు పరిణామాలతోనే ఈ దాడులకు పాల్పడవచ్చని నిఘా సంస్థలు కేంద్ర హోం శాఖకు వెల్లడించాయి.
ఉగ్రవాదుల టాప్ లిస్ట్ లో RSS నేతలు ఉన్నట్లుగా నిఘా సంస్థలు హెచ్చరించాయి. RSS ప్రధాన కార్యాలయాలకు కూడా ప్రమాదం ఏర్పడవచ్చని హెచ్చరించాయి.
NCR, NIA, COG, police, NSG, పారా మిలటరీ శిక్షణా కేంద్రాలు, CRPF కార్యాలయాలను కూడా ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నాయని నిఘా సంస్థలు హెచ్చరించాయి. దీంతో కేంద్ర హోంశాఖ సంబంధిన భద్రతాదళాలను అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకుంది.
కాగా…దీపావళి పండుగ క్రమంలో ముందుస్తు జాగ్రత్తగా ఢిల్లీలోని పలు రద్దీ ప్రాంతాల్లో నిఘాని పోలీసులు పటిష్టంచేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.