Ukraine Russia War : రష్యా- యుక్రెయిన్ సంక్షోభంపై పుతిన్‌తో ఈ రాత్రి మాట్లాడనున్న ప్రధాని మోదీ!

యుక్రెయిన్ సంక్షోభంతో పాటు, యుక్రెయిన్‌లో ఉన్న భారతీయ విధ్యార్ధుల భద్రతపై గురువారం (ఫిబ్రవరి 24) రాత్రి రష్యా అధ్యక్షుడు పుతీన్‌తో ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం ఉంది.

Ukraine Russia War : రష్యా- యుక్రెయిన్ సంక్షోభంపై పుతిన్‌తో ఈ రాత్రి మాట్లాడనున్న ప్రధాని మోదీ!

Russia Ukraine War Pm Modi Will Speak To Russia's Putin Tonight On Ukraine Crisis

Updated On : February 24, 2022 / 8:27 PM IST

Ukraine Russia War : యుక్రెయిన్‌లో పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. వీరితో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజీత్ దోవల్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుత యుక్రెయిన్‌లో తాజా పరిస్థితులపై ప్రధానమంత్రి మోదీకి విదేశాంగ శాఖ వివరించనుంది. యుక్రెయిన్‌ నుంచి హంగేరీ సరిహద్దుల ద్వారా భారతీయులను తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

హంగేరి-యుక్రెయిన్‌ సరిహద్దుల్లోని జొహానైకు భారత రాయబార కార్యాలయ సిబ్బంది చేరుకున్నారు. హంగేరీ ప్రభుత్వ సహాయంతో యుక్రెయిన్‌లోని భారతీయులను హంగేరీలోకి తీసుకొచ్చి, అక్కడినుంచి భారత్ తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యున్నత స్థాయి సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడనున్నారు. రష్యా-యుక్రెయిన్ పరిణామాలు.. యుక్రెయిన్ లోని భారతీయుల భద్రతపై మోదీ చర్చించనున్నారు. రష్యా- యుక్రెయిన్ సంక్షోభంతో పాటు, యుక్రెయిన్‌లో ఉన్న భారతీయ విధ్యార్ధుల భద్రతపై గురువారం (ఫిబ్రవరి 24) రాత్రి రష్యా అధ్యక్షుడు పుతీన్‌తో ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం ఉంది.

Russia Ukraine War Pm Modi Will Speak To Russia's Putin Tonight On Ukraine Crisis (1)

Russia Ukraine War Pm Modi Will Speak To Russia’s Putin Tonight On Ukraine Crisis

మరోవైపు.. శుక్రవారం (ఫిబ్రవరి 25)న నాటో దేశాల అధినేతలు సమావేశం కానున్నారు. యుక్రెయిన్ పై రష్యాదాడులను నాటో తీవ్రంగా ఖండించింది. యుక్రెయిన్‌ను కాపాడేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని నాటో స్పష్టం చేసింది. యుక్రెయిన్ ప్రజలు, ప్రభుత్వానికి అండగా ఉంటామని నాటో సెక్రటరీ జనరల్ తెలిపారు. యుక్రెయిన్ పై రష్యా వెంటనే దాడులు ఆపేయాలని నాటో హెచ్చరించింది. ఇదిలా ఉండగా… యుక్రెయిన్‌లోని అన్ని నగరాలపై రష్యా దాడులు చేస్తోంది. రష్యా దాడిలో 40 మంది యుక్రెయిన్ సైనికులు మృతిచెందారు. పదిమందికి పైగా సామన్య పౌరులు మృతిచెందినట్టు ప్రకటించారు.

రెండు ఎయిర్ ఫోర్టులను రష్యా సైన్యం ధ్వంసం చేసింది. రష్యా దాడులను యుక్రెయిన్ సైనిక దళం కూడా తిప్పికొడుతోంది. మరో రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసినట్టు యుక్రెయిన్ వెల్లడించింది. మొత్తం 7 రష్యా యుద్ధ విమానాలను కూల్చివేసినట్టు ప్రకటించింది. 50 మంది రష్యా సైనికులను హతమార్చినట్టు యుక్రెయిన్ ప్రకటించింది. రష్యాతో పూర్తిగా దౌత్య సంబంధాలను తెంచుకున్నట్టుగా యుక్రెయిన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Read Also :  Ukraine Crisis : యుక్రెయిన్‌లో పరిస్థితులపై కేంద్రం అలర్ట్..!