అమ్మాయిలతో షేవింగ్ చేయించుకున్న సచిన్ టెండుల్కర్

  • Published By: vamsi ,Published On : May 4, 2019 / 08:37 AM IST
అమ్మాయిలతో షేవింగ్ చేయించుకున్న సచిన్ టెండుల్కర్

Updated On : May 4, 2019 / 8:37 AM IST

ఉత్తరప్రదేశ్‌లోని బన్వారి తోల అనే గ్రామంలో నేహ, జ్యోతి అనే ఇద్దరు అమ్మాయిలు హెయిర్‌ కటింగ్‌, గడ్డం చేయడం గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. వారి తండ్రికి జబ్బు చేయటంతో.. రోజు గడవడం కష్టంగా మారిన పరిస్థితిలో వాళ్లు అటువంటి నిర్ణయం తీసుకున్నారు. మొదట్లో కష్టమర్లు రారేమో అని అబ్బాయిలలా డ్రెస్సింగ్ వేసుకుని, కటింగ్, గడ్డం చేయడం మొదలెట్టిన వారు ఇప్పుడు ఖాళీ లేకుండా పని చేసుకుంటున్నారు. వారిపైన జిల్లేట్ కంపెనీ ఒక యాడ్‌ను కూడా చేసింది. ఆ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది.

అయితే తాజాగా ఆ అమ్మాయిలు నడిపిస్తున్న బార్బర్ షాప్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ వారిని ఆశ్చర్యపరిచాడు. అక్కడకు వెళ్లిన సచిన్ అమ్మాయిల చేత కటింగ్ షేవింగ్ చేయించుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు. ‘ఇది మొదటిసారి. ఇంతకు ముందెప్పుడూ నేను ఎవరితో కూడా షేవింగ్ చేయించుకోలేదు. ఆ రికార్డ్  ఇప్పుడు బద్ధలైంది. నేను బార్బర్ షాప్ గర్ల్స్‌ను కలిశాను. జిల్లెట్ ఇండియా వారు అందించిన స్కాలర్‌షిప్ కూడా వారికి అందించాను’ అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు సచిన్. సచిన్ పోస్టుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. క్రికెట్ అభిమానులయితే సచిన్‌ను మీరు సూపర్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.