Akhilesh Yadav : చంద్రబాబు అరెస్టుపై అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Akhilesh Yadav : చంద్రబాబు అరెస్టుపై అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Akhilesh Yadav ..Chandrababu

Updated On : September 12, 2023 / 12:45 PM IST

Akhilesh Yadav ..Chandrababu arrest : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ నేతలు కూడా స్పందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతు..చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపులా ఉందని..అరెస్ట్ చేసిన తీరు సరికాదన్నారు. టీడీపీ హయాంలో తప్పు జరిగితే పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలి తప్ప కక్షపూరితంగా వ్యవహరించటం సరికాదన్నారు.

తాజాగా యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తు చంద్రబాబు అరెస్ట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయటం ట్రెండ్ గా మారిపోయిందని ఇది కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు కూడా ట్రెండ్ గా మారింది అంటూ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నవారు ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టటం నిరకుశపాలనకు నిదర్శమన్నారు.

CM Mamata Banerjee : చంద్రబాబు అరెస్టుపై సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

ఇటువంటివాటినికి ప్రజాస్వామ్యంలో తావులేదన్నారు. రాజకీయాల్లో ఇటువంటి చర్యలకు భారీ మూల్యం తప్పదు అన్నారు. స్వార్థపూరిత రాజకీయాలు చేసే బీజేపీ ఎవరికి రాజకీయ మిత్రుడు కాలేదు అంటూ చంద్రబాబుకు ట్యాగ్ చేస్తు ట్వీట్ చేశారు అఖిలేవ్ యాదవ్.