Satyapal Malik: విపక్షాలన్ని కలిసి పుల్వామా దాడి మీద మాట్లాడితే మోదీ ప్రభుత్వం కూలిపోతుందట
పుల్వామా దాడిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పుల్వామా దాడిపై వాస్తవాలు ప్రకటించాలని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ అన్నారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారని జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా ఉన్న మాలిక్ ఇటీవల ఆరోపించారు

Satyapal Malik
Satyapal Malik: ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పుల్వామా అంశంపై మాట్లాడితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూలిపోతుందని జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. దీనికి ముందు ఆయన భారతీయ జనతా పార్టీకి మినహా దేశంలో మరే పార్టీకైనా మద్దతు ఇస్తానంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. నాలుగేళ్ల క్రితం జరిగిన పుల్వామా దాడి గురించి వారం రోజులుగా సత్యపాల్ మాలిక్ మాట్లాడుతున్నారు. అంతే కాకుండా ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఏప్రిల్ 14న సీనియర్ జర్నలిస్టు కరణ్ థాపర్‌కు సత్యపాల్ మాలిక్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన చాలా విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా పుల్వామా దాడి ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన అన్నారు. సైనికులను తరలించడానికి విమానాలు కావాలని తాను ముందుగానే కేంద్ర ప్రభుత్వాన్ని కోరానని, అయితే అందుకు హోంమంత్రిత్వ శాఖ నో చెప్పిందని అన్నారు. ఆ తర్వాతే సైనికుల వాహనంపై దాడి జరిగిందని అన్నారు. అంతే కాకుండా దాడి గురించి మోదీకి సమాచారం అందించగా.. ఈ విషయం బయటికి చెప్పొద్దని అన్నారని, తన నోరు మూయించారని అన్నారు. బహుశా ఓట్ల కోసమే అలా చేసుంటారనే కోణంలో సైతం సత్యపాల్ మాలిక్ స్పందించారు.
Giaspura Gas Leak: పంజాబ్‌లో విషాదం.. విషవాయువు లీక్ కావడంతో తొమ్మిది మంది మృతి ..
కాగా, ఈ విషయాలపై మాట్లాడుతున్న తరుణంలోనే సత్యపాల్ మాలిక్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ సమన్లు పంపడం గమనార్హం. జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా మాలిక్ ఉన్న సమయంలో రిలయన్ ఇన్సూరెన్స్ అంశానికి సంబంధించిన అంశంపై సీబీఐ సమన్లను పంపించింది. ఈనెల 28న విచారణకు హాజరుకావాలని ఆ సమన్లలో కోరింది. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో ఆయనను ప్రశ్నించనున్నారు.
Karnataka Polls: కర్ణాటకలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయాలని కమల్ హాసన్‌కు విజ్ణప్తులు
పుల్వామా దాడిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పుల్వామా దాడిపై వాస్తవాలు ప్రకటించాలని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ అన్నారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారని జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా ఉన్న మాలిక్ ఇటీవల ఆరోపించారు. ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీలు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో అతని వ్యాఖ్య రాజకీయ తుఫానును రేకెత్తించింది. ఇటీవలి మీడియా కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ ఆరోపణల గురించి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పించుకున్నారని గౌరవ్ గొగోయ్ శనివారం పేర్కొన్నారు.