SBI Home Loan… అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు.. ఇలా అప్లయ్ చేసుకోండి

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అంతేకాదు ప్రతి ఒక్కరి ప్రాధమిక అవసరం కూడా. ఏది ఉన్నా లేకపోయినా ఉండడానికి ఓ ఇల్లు ఉంటే చాలని అనుకుంటారు. అందుకే అప్పో సప్పో చేసి మరీ ఇల్లు కొనాలని, కట్టుక

SBI Home Loan… అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు.. ఇలా అప్లయ్ చేసుకోండి

Sbi Home Loan

Updated On : September 27, 2021 / 9:09 PM IST

SBI Home Loan : సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అంతేకాదు ప్రతి ఒక్కరి ప్రాధమిక అవసరం కూడా. ఏది ఉన్నా లేకపోయినా ఉండడానికి ఓ ఇల్లు ఉంటే చాలని అనుకుంటారు. అందుకే అప్పో సప్పో చేసి మరీ ఇల్లు కొనాలని, కట్టుకోవాలని ఆశపడుతుంటారు. ఇల్లు కొనడం అన్నా కట్టడం అన్నా అంత సులభం కాదు. పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. మరి ఆ డబ్బు అప్పుగా ఎవరిస్తారు? అదీ తక్కువ వడ్డీతో? ఇలాంటి వారికి దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది.

దేశంలోని అతిపెద్ద రుణదాత ఎస్బీఐ 6.70 శాతం వడ్డీ రేటుతో హోమ్ లోన్ (గృహ రుణాలను) ఇస్తోంది. మరి, గృహ రుణం పొందడానికి అర్హత ఏంటి? అవసరమైన పత్రాలు ఏంటి? ఎలా అప్లయ్ చేసుకోవాలి? దీనికి సంబంధించి జాబితాను ఎస్బీఐ విడుదల చేసింది.

Google Chrome వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. వెంటనే ఈ పని చేయండి

ఎస్బీఐ హోమ్ లోన్ కోసం అవసరమైన ముఖ్యమైన పత్రాలు..
* ఉద్యోగి గుర్తింపు(ఐడెంటిటీ) కార్డు
* లోన్-అప్లికేషన్: పూర్తిగా నింపిన రుణ దరఖాస్తు ఫారం మీద మూడు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు అతికించాలి.
* గుర్తింపు రుజువు (ఏదైనా ఒకటి):
పాన్ /డ్రైవింగ్ లైసెన్స్/ పాస్ పోర్ట్/ఓటర్ ఐడి కార్డు
నివాస రుజువు లేదా చిరునామా(ఏదైనా ఒకటి):
ఇటీవల విద్యుత్ బిల్లు/టెలిఫోన్ బిల్లు/ వాటర్ బిల్లు/ పైప్డ్ గ్యాస్ బిల్లు లేదా పాస్ పోర్ట్/ఆధార్ కార్డు/డ్రైవింగ్ లైసెన్స్ కాపీ

Curry Leaves : కరివేపాకు కొలెస్టరాల్ ను తగ్గిస్తుందా..?

ప్రాపర్టీ పేపర్లు:
* నిర్మాణానికి అనుమతి (వర్తించే చోట)
* అమ్మకానికి నమోదు చేసుకున్న ఒప్పందం (మహారాష్ట్రకు మాత్రమే)/అమ్మకానికి స్టాంప్డ్ ఒప్పందం/కేటాయింపు లేఖ
* ఆక్యుపెన్సీ సర్టిఫికేట్(ఆస్తిని బదిలీ చేయడానికి సిద్ధంగా ఉంటే)
* మెయింటెనెన్స్ బిల్లు, విద్యుత్ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు
* ఆమోదించబడ్డ ప్లాన్ కాపీ(జిరాక్స్ బ్లూప్రింట్), బిల్డర్ రిజిస్టర్డ్ డెవలప్ మెంట్ అగ్రిమెంట్, కన్వేయన్స్ డీడ్(కొత్త ఆస్తి కోసం)
* చెల్లింపు రసీదులు లేదా బిల్డర్ లేదా విక్రేతకు చేసిన అన్ని చెల్లింపులను చూపించే బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్

* దరఖాస్తుదారుడు కలిగి ఉన్న అన్ని బ్యాంకు ఖాతాలకు సంబంధించి గత ఆరు నెలల బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్లు
* ఒకవేళ ఇతర బ్యాంకులు నుంచి రుణం తీసుకుంటే, గతేడాది రుణ ఖాతా స్టేట్ మెంట్

వేతన దరఖాస్తుదారుడు(శాలరీడ్ అప్లికెంట్)
* శాలరీ స్లిప్ లేదా గత మూడు నెలల వేతన సర్టిఫికేట్
* గత రెండు సంవత్సరాలుగా ఫారం 16 కాపీ లేదా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఐటి రిటర్న్స్ కాపీ

వేతనేతర దరఖాస్తుదారుడు(నాన్ శాలరీడ్ అప్లికెంట్)
* బిజినెస్ చిరునామా రుజువు
* గత మూడేళ్ల ఐటీ రిటర్న్స్
* గత మూడేళ్ల బ్యాలెన్స్ షీట్, లాభం, నష్టం ఖాతా
* బిజినెస్ లైసెన్స్ వివరాలు(లేదా సమానమైనవి)
* టీడీఎస్ సర్టిఫికెట్ (ఫారం 16ఏ – ఒకవేళ వర్తిస్తే)
* అర్హత సర్టిఫికెట్(సి.ఏ/డాక్టర్ లేదా ఇతర ప్రొఫెషనల్స్ కోసం)

పండుగ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని ఎస్బీఐ ఈ హోమ్ లోన్ ఆఫర్ అనౌన్స్ చేసింది. గతంలో రూ.75లక్షల కన్నా ఎక్కువ హోమ్ లోన్ కావాలంటే ఇంట్రస్ట్ రేట్ 7,15 శాతంగా ఉండేది. అయితే ఎస్బీఐ తాజాగా ఇచ్చిన ఆఫర్ తో రూ.75లక్షల లోన్ (30ఏళ్ల గడువు) పై రూ.8లక్షల కన్నా ఎక్కువ మొత్తం ఆదా చేయొచ్చు.

ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా పలు రకాల హోమ్ లోన్లు ప్రవేశపెట్టింది ఎస్బీఐ. వాటిలో రెగులర్ హోమ్ లోన్, ఎస్బీఐ ప్రివిలేజ్ హోమ్ లోన్(ప్రభుత్వ ఉద్యోగుల కోసం), ఎస్బీఐ శౌర్య హోమ్ లోన్(ఆర్మీ, డిఫెన్స్ వారి కోసం), ఎస్బీఐ మ్యాక్స్ గెయిన్ హోమ్ లోన్, ఎస్బీఐ స్మార్ట్ హోమ్, టాపప్ లోన్, ఎస్బీఐ ఎన్ఆర్ఐ హోమ్ లోన్, ఎస్బీఐ ఫ్లెక్సీ పే హోమ్ లోన్, ఎస్బీఐ హర్ ఘర్ హోమ్ లోన్(మహిళల కోసం).