సోషల్ మీడియాను వాడొద్దు.. మీ ఫోన్లలో వాటిని వెంటనే తొలగించండి.. జవాన్లకు ఉన్నతాధికారుల ఆదేశాలు.. ఎందుకంటే..?

బస్తర్ విభాగంలోని భద్రతా దళాలు వారి మొబైల్ ఫోన్ల నుంచి అన్ని సోషల్ మీడియా అప్లికేషన్లను తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

సోషల్ మీడియాను వాడొద్దు.. మీ ఫోన్లలో వాటిని వెంటనే తొలగించండి.. జవాన్లకు ఉన్నతాధికారుల ఆదేశాలు.. ఎందుకంటే..?

Jawans

Updated On : July 22, 2025 / 1:15 PM IST

Social Media: ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బస్తర్ విభాగంలోని భద్రతా దళాలు వారి మొబైల్ ఫోన్ల నుంచి అన్ని సోషల్ మీడియా అప్లికేషన్లను తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. విధుల్లో ఉన్న సమయంలో వీడియోలు తీయొద్దు.. సోషల్ మీడియా అస్సలే వాడొద్దు.. గోప్యతను పాటించాలని జవాన్లకు క్లాస్ తీసుకున్నారు.

జవాన్లు అనుకోకుండా షేర్ చేస్తున్న వైరల్ కంటెంట్ మన ప్రణాళికను, గోప్యతను దెబ్బతీస్తుంది. మావోయిస్టులు అలర్ట్ అవుతున్నారు. ఇలాంటి పరిణామాల వల్ల జవాన్ల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని, విధుల్లో ఉన్న సమయంలో సోషల్ మీడియాను వాడొద్దని బస్తర్ రేంజ్ ఐజి పీ. సుందరరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. బస్తర్‌లోని ఏడు జిల్లాల పరిధిలో జవాన్లు, అధికారులు అలర్ట్‌గా ఉండాలని సూచించారు.

ఎన్‌కౌంటర్ ఫొటోలు, వీడియోలు, ప్రత్యక్ష ఎన్‌కౌంటర్‌లను కొందరు ఆన్‌లైన్‌లో పోస్టు చేయడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. భద్రతా సిబ్బంది ఫోన్ల నుండి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి యాప్‌లను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు.