భారత్ కు ఏడు యుద్ధ విమానాలు: రాజ్ నాథ్ సింగ్

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫ్రాన్స్ దేశ పర్యటనను ముగించుకొని గురువారం(10 అక్టోబర్ 2019) రాత్రికి ఢిల్లీకి చేరకున్నారు. వచ్చే ఏడాది ఏప్రియల్, మే నెలాకరులో భారత దేశానికి ఏడు రాఫెల్ యుద్ధ విమానాలు రానున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సంధర్భంగా మీడియాతో రాజ్ నాథ్ సింగ్.. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విజయవంతంగా పూర్తి చేసిన ఘనత ఒక్క నరేంద్ర మోడీ కే దక్కుతుందని అన్నారు. రాఫెల్ యుద్ధ విమానం గంటకు 18వందల కిలోమీటర్ల వేగంతో నడుస్తాయని వెల్లడించారు.
రాఫెల్ యుద్ధ విమానాలను నడిపే పద్దతి గురించి భారత వాయుసేన అధికారులకి ఫ్రాన్స్ లో ప్రత్యేక శిక్షణ ఇప్పించినట్లు రాజ్ నాథ్ వెల్లడించారు.