CAA మంటలు : మోడీ నియోజకవర్గంలో సామాజిక కార్యకర్తలకు షాక్

ఉత్తరప్రదేశ్ పోలీసుల సామాజిక కార్యకర్తలకు షాక్ ఇచ్చారు. వారిపై కేసులు నమోదు చేశారు. హింసకు పాల్పడ్డారని, విధ్వంసానికి దిగారని కేసులు పెట్టారు. మొత్తం 56మంది సోషల్

  • Published By: veegamteam ,Published On : December 26, 2019 / 05:11 AM IST
CAA మంటలు : మోడీ నియోజకవర్గంలో సామాజిక కార్యకర్తలకు షాక్

Updated On : December 26, 2019 / 5:11 AM IST

ఉత్తరప్రదేశ్ పోలీసుల సామాజిక కార్యకర్తలకు షాక్ ఇచ్చారు. వారిపై కేసులు నమోదు చేశారు. హింసకు పాల్పడ్డారని, విధ్వంసానికి దిగారని కేసులు పెట్టారు. మొత్తం 56మంది సోషల్

ఉత్తరప్రదేశ్ పోలీసుల సామాజిక కార్యకర్తలకు షాక్ ఇచ్చారు. వారిపై కేసులు నమోదు చేశారు. హింసకు పాల్పడ్డారని, విధ్వంసానికి దిగారని కేసులు పెట్టారు. మొత్తం 56మంది సోషల్ యాక్టివిస్టులపై కేసులు పెట్టారు. వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వారణాసిలో డిసెంబర్ 19న సామాజిక కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంతో శాంతియుతంగా తమ నిరసన తెలిపారు. అయితే.. పోలీసులు మాత్రం వారిపై కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది. హింసకు పాల్పడ్డారని ఆరోపిస్తూ 56మందిపై కేసులు పెట్టారు. 69మంది సోషల్ యాక్టివిస్టులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిలో 56మందిపై కేసులు పెట్టారు.

సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్(CAA) ను వ్యతిరేకిస్తూ యూపీలో ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా కొన్ని ప్రాంతాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. బస్సులను ధ్వంసం చేశారు. టైర్లకు నిప్పు పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలపై రాళ్లు రువ్వారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారు. అల్లర్లకు కారణమైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకంగా 700మందిని అదుపులోకి తీసుకున్నారు. 

ఈ క్రమంలో డిసెంబర్ 19న పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా సామాజిక కార్యకర్తలు శాంతియుతంగా నిరసన చేపట్టారు. అయితే అల్లర్లకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వారిపైనా పోలీసులు కేసులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో చాలా కాలంగా సోషల్ యాక్టివిస్ట్ గా పని చేస్తున్న వారు ఉన్నారు. బాగా చదువుకున్న వాళ్లు, స్కాలర్లు కూడా ఉన్నారు. దివాకర్ సింగ్ ఆ కోవకే చెందుతారు. ఐఐటీ బెనారస్ హిందూ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో రవి కుమార్, ఏక్తా అనే మరో ఇద్దరు సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు. ఇంకా అనేకమంది విద్యార్థులు ఉన్నారు.