Kamal Haasan: చెన్నై స్కూల్ టీచర్ అలాంటి పనిచేశారని తెలిసి షాక్ అయ్యా – కమల్‌హాసన్

పలువురు స్టూడెంట్లను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలతో చెన్నై స్కూల్ టీచర్ అరెస్టు అయ్యాడు. ఆ విషయం తెలిసి తాను షాక్ కు గురయ్యానని కమల్ హాసన్ అంటున్నారు.

Kamal Haasan: చెన్నై స్కూల్ టీచర్ అలాంటి పనిచేశారని తెలిసి షాక్ అయ్యా – కమల్‌హాసన్

Kamal Hasan

Updated On : May 26, 2021 / 7:34 PM IST

Kamal Haasan: పలువురు స్టూడెంట్లను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలతో చెన్నై స్కూల్ టీచర్ అరెస్టు అయ్యాడు. ఆ విషయం తెలిసి తాను షాక్ కు గురయ్యానని కమల్ హాసన్ అంటున్నారు. స్టూడెంట్లు చేసిన కంప్లైంట్లపై స్కూల్ యాజమాన్యం చర్యలు తీసుకోలేదు.

దీనిపై టీంతో ప్రత్యేకమైన విచారణ చేయించాలని.. ఇతర ఎడ్యుకేషనల్ సంస్థల్లో జరిగినా ఇదే పద్ధతి పాటించాలని అన్నారు. ’27ఏళ్ల క్రితం విడుదలైన నా సినిమా.. మహానదిలో ఇద్దరి కూతుళ్ల తండ్రి భయాన్ని మళ్లీ గుర్తు చేశారు’ పేరెంట్స్ అయినా వారి బాధను విని సపోర్ట్ చేయాలని వెల్లడించారు.

ఈ కేసును డైవర్ట్ చేయడానికి కులానికి సంబంధించిన అంశాలను జోడిస్తున్నారు. ఇది కూడా రాజకీయ లబ్ధి కోసమే. నిందితులు కులాలకు అతీతంగా శిక్షింపబడాలి. పలువురు స్టూడెంట్లు చేసిన ఫిర్యాదు మేరకు టీచర్ పై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.