పాన్ మసాలా అమ్మలేదని కొట్టి చంపారు
ఇంటిపక్కనే ఉన్న పాన్ షాప్ యజమాని అడిగినప్పుడు పాన్ మసాలా ఇవ్వలేదని దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ ఘటన ఏప్రిల్ 14నే జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో

ఇంటిపక్కనే ఉన్న పాన్ షాప్ యజమాని అడిగినప్పుడు పాన్ మసాలా ఇవ్వలేదని దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ ఘటన ఏప్రిల్ 14నే జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఉంటున్న ప్రేమ్ నరైన్ దివాకర్ అనే వ్యక్తి పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు. పొరుగున ఉంటున్న నితిన్ పాండే పాన్ మసాలా కావాలని షాప్ ఓపెన్ చేయాలని బెదిరించాడు.
కరోనా వైరస్ లాక్‌డౌన్‌ను ఎదురించలేనని, చట్ట రీత్యా నేరమని తన మీద శిక్షపడుతుందని చెప్పాడు. అయినప్పటికీ వినకుండా నితిన్ సహనం కోల్పోయి అతనిని డిమాండ్ చేస్తుండటంతో ఇద్దరి మధ్య వాదన పెరిగింది. క్షణాల్లో ఇద్దరూ చేయి చేసుకోవడం మొదలైంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటుండగా ప్రేమ్‌పై నితిన్ ఇనుపరాడ్డుతో దాడి చేశాడు.
60 ఏళ్ల పాన్ షాప్ వ్యక్తి ప్రేమ్‌ని కొట్టడంతో స్పాట్ లోనే పడిపోయాడు. తీవ్రంగా రక్త స్రావమై స్థానికులు గమనించేసరికి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ ఇప్పించారు. గాయాలతో సోమవారం వరకూ చికిత్స తీసుకుని మృతి చెందాడు. పోలీసులు నితిన్ పై కేసు బుక్ చేసి అరెస్టు చేశారు.