Bus Falls into River : మేఘాలయలో ఘోరం..బ్రిడ్జిపై నుంచి నదిలో పడ్డ బస్సు..ఆరుగురు దుర్మరణం

మేఘాలయలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

Bus Falls into River : మేఘాలయలో ఘోరం..బ్రిడ్జిపై నుంచి నదిలో పడ్డ బస్సు..ఆరుగురు దుర్మరణం

Bus Falls Into River In Meghalaya

Updated On : September 30, 2021 / 12:07 PM IST

6 dead after bus falls into river : మేఘాలయలో ఘోర ప్రమాదం సంభవించింది. 21మంది ప్రయాణీకులతో వెళ్లుతున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడి నదిలో పడిపోయింది. మేఘాలయలోని నాంగ్‌చ్రామ్ ప్రాంతంలో బుధవారం (సెప్టెంబర్ 29,2021)అర్ధరాత్రి బ్రిడ్జీ మీద నుంచి వెళుతున్న బస్సు రింగ్డి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోరు. మరో 16 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి రెస్క్యూ టీమ్ పాటు చేరుకున్నారు. వెంటనే సహాయం చర్యల్ని చేపట్టి గాయపడినవారిని సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు.

Read more : Accident : లోయ‌లో ప‌డ్డ బ‌స్సు..24 మంది మృతి

సుమారు 21 మంది ప్రయాణికులతో బస్సు తురా నుంచి షిల్లాంగ్‌కు వెళ్తున్నక్రమంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో నాంగ్‌చ్రామ్ వద్ద అదుపు తప్పి రింగ్ది నదిపాయలోకి పడిపోయింది. ఈ బ్రిడ్జి రింగ్దీ నదిపై ఈస్ట్ గారో హిల్స్, వెస్ట్‌ కాశీ హిల్స్‌ జిల్లా మధ్య ఉన్నదని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీశామని, మరో రెండు మృతదేహాల కోసం గాలిస్తున్నామని తెలిపారు.కాగా.. ప్రమాద సమయంలో బస్సు చాలా వేగంగా ప్రయాణిస్తోందని..అలా వేగంగా దూసుకుపోతు..అదుపుతప్పి బస్సు ముందు భాగం బ్రిడ్జిని ఢీకొట్టి నదిలో పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Read more : Srilanka Bus Crashes : లోయలో పడ్డ బస్సు.. 14 మంది మృతి, 30మందికి తీవ్ర గాయాలు