Son Beat Mother: 75 ఏళ్ల తల్లిని లాగి కిందపడేసిన కొడుకు.. వీడియో

తల్లిని చేయిపట్టి బయటకు గుంజి చీపురుతో కొట్టాడో కసాయి కొడుకు.. ఈ దారుణ ఘటన గుజరాత్ లోని మోర్బీ జిల్లా కంటిపూర్ లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మన్‌సుఖ్‌ పర్‌మర్‌ వ్యవసాయ కూలీ.. ఈయనకు ఇద్దరు కూతుర్లు

Son Beat Mother: 75 ఏళ్ల తల్లిని లాగి కిందపడేసిన కొడుకు.. వీడియో

Son Beat Mother

Updated On : May 12, 2021 / 6:18 PM IST

Son Beat Mother: తల్లిని చేయిపట్టి బయటకు గుంజి చీపురుతో కొట్టాడో కసాయి కొడుకు.. ఈ దారుణ ఘటన గుజరాత్ లోని మోర్బీ జిల్లా కంటిపూర్ లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మన్‌సుఖ్‌ పర్‌మర్‌ వ్యవసాయ కూలీ.. ఈయనకు ఇద్దరు కూతుర్లు.. వీరిలో ఓ కూతురు మన్‌సుఖ్‌ పర్‌మర్‌ తల్లిని చేయిపట్టి ఇంట్లోంచి ఈడ్చుకురాగా బయట ఉన్న మన్‌సుఖ్‌ పర్‌మర్‌ వృద్ధురాలి చెయ్యిపట్టుకొని కిందపడేసినంత పని చేశాడు.

అనంతరం పక్కనే ఉన్న చీపురు తీసుకోని తల్లిని కొట్టబోయాడు.. దీంతో మరోకుతురు అతడిని అడ్డుకొని చీపురు లాక్కుంది. కూతురుతో వాగ్వాదానికి దిగి చీపురు తీసుకోని తల్లిపై దాడి చేశాడు మన్‌సుఖ్‌ పర్‌మర్‌. కొద్దిసేపటి తర్వాత మన్‌సుఖ్‌ పర్‌మర్‌ భార్య, అతడిని పక్కకు జరిపి వృద్ధురాలిని ఇంట్లోకి తీసుకెళ్లింది. ఈ ఉదంతాన్ని అక్కడ ఉన్నవారు వీడియో తీశారు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో కొడుకు తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక అటు ఇటు తిరిగి వీడియో పోలీసుల కంట కడటంతో మన్‌సుఖ్‌ పర్‌మర్‌ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

వృద్ధురాలిపై దాడి చేసిన కొడుకు మన్‌సుఖ్‌ పర్‌మర్‌ కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యతులో జరగకుండా ఉండాలంటే బహిరంగంగా శిక్షించాలని కోరుతున్నారు.