Sonia Gandhi: ఈడీ ఎంక్వైరీకి నేడే సోనియా

సోనియా గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు వేళైంది. నేషనల్‌ హెరాల్డ్‌–ఏజేఎల్‌ వ్యవహారానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు గురువారం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగానే మరోసారి నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది.

Sonia Gandhi: ఈడీ ఎంక్వైరీకి నేడే సోనియా

Sonia Gandhi

Updated On : July 21, 2022 / 7:24 AM IST

Sonia Gandhi: సోనియా గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు వేళైంది. నేషనల్‌ హెరాల్డ్‌–ఏజేఎల్‌ వ్యవహారానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు గురువారం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగానే మరోసారి నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది.

ప్రభుత్వంలోని బడా లీడర్ల ఆదేశాల ప్రకారమే ఈడీ నడుచుకుంటోందని, ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనిగా పెట్టుకుందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ మేరకు చేపట్టనున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా పార్టీ ఎంపీలు, నేతలు కాంగ్రెస్‌ కార్యాలయం నుంచి ఈడీ ఆఫీసు దాకా పాదయాత్ర నిర్వహించనున్నారు. అలాగే రాజ్‌భవన్‌ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై ఎలా స్పందించాలనే దానిపై ఎంపీ మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం కానున్నారు.

సోనియా గాంధీ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందంటూ కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది.

Read Also: మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీకి ఈడీ మరోసారి సమన్లు

రాహుల్ గాంధీ విచారణ:
జూన్ నెల మధ్యలో రాహుల్ గాంధీని దాదాపు 5 రోజులు అంటే దాదాపు 50 గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రోజూ ప్రదర్శనలు చేస్తూ ఆ పార్టీకి చెందిన పెద్ద నాయకులను అరెస్టు చేశారు. ఈడీ అధికారులు గత నెలలోనే సోనియాకు స‌మ‌న్లు జారీ చేశారు.

సోనియా గత నెలలో కరోనా బారినపడటం… కోలుకున్న తర్వాత పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలతో ఇబ్బందిపడటంతో వారం రోజుల పాటు ఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. దాంతో విచారణకు మరింత గడువు కావాలని ఈడీని కోరి జులై 21న హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు.

ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీల కంటే ముందే పవన్ బన్సాల్, మల్లికార్జున్ ఖర్గే తదితరులను ప్రశ్నించారు. స్వాతంత్ర్య వారసత్వంతో సంబంధం ఉన్న AJLకి దాని నాయకులు సహాయం చేశారని, యంగ్ ఇండియన్ కంపెనీ ఏర్పడిన నిబంధనల ప్రకారం వాటాదారులు ఒక్క రూపాయి కూడా ఉపసంహరించుకోలేరని కాంగ్రెస్ వాదిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నల్లధనాన్ని.. వైట్‌గా మార్చుకుంటున్నారనే ఆరోపణలు నిరాధారమైనవని కాంగ్రెస్ కొట్టిపారేసింది.