ఫేస్ బుక్ ప్రియుడి కోసం దేశాలు దాటిన ప్రియురాలు

  • Published By: chvmurthy ,Published On : March 11, 2020 / 05:51 AM IST
ఫేస్ బుక్ ప్రియుడి కోసం దేశాలు దాటిన ప్రియురాలు

Updated On : March 11, 2020 / 5:51 AM IST

వాళ్లిద్దరికీ ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. క్రమేపి ఆ ప్రేమ బలపడసాగింది. కానీ ఇద్దరూ కలుసుకోలేక పోతున్నారు. ఎందుకంటే ఇద్దరివీ వేర్వేరు దేశాలు. తన ప్రియుడ్ని చూడాలంటే దేశం దాటి వెళ్లాలి. చివరికి తన ప్రియుడ్ని కలవటానికి ఆ ప్రియురాలు భారత దేశం వచ్చింది. ప్రియుడ్ని చూడటానికి ఇండియా వచ్చిన తమ కుమార్తెను రక్షించమని ఆమె తల్లి తండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 

శ్రీలంక రత్నపురా జిల్లాకు చెందిన జైనుల్లా పుదిన్‌ కుమార్తె రిజ్వి ఫాతిమా గుప్తా (21) కు చెన్నైలో ప్రైవేటు సంస్థలో పనిచేసే మహ్మద్‌ ముబారక్‌ (25) తో పేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారింది. ముబారక్ తమిళనాడులోని బన్రూట్టి సమీపంలోని వి.ఆండికుప్పం గ్రామానికి చెందిన వ్యక్తి. ఇలా ఉండగా ప్రియుడిని చూసేందుకు ప్రియురాలు తమిళనాడుకు వచ్చేందుకు ఆశపడింది. ఈ విషయం తన ప్రేమికుడికి తెలిపింది. దీంతో జనవరి 26న టూరిస్టు వీసా ద్వారా శ్రీలంక నుంచి చెన్నైకు విమానం ద్వారా వచ్చింది. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి బన్రూట్టికి వచ్చారు. అక్కడి ఇద్దరు సరదాగా  కాలం గడుపుతున్నారు.

రిజ్వి ఫాతిమా తల్లిదండ్రులు కువైట్‌లో పని చేస్తుండడంతో కుమార్తె ప్రేమ వ్యవహారం తెలియకుండా పోయింది. కొద్ది రోజుల క్రితం శ్రీలంకలోని వారి బంధువులు కువైట్‌లో నివసిస్తున్న రిజ్వి ఫాతిమా తల్లిదండ్రులకు కుమార్తె ప్రేమ వ్యవహారం… ఆమె ఇండియా వెళ్లిన విషయం గురించి  చెప్పారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు వెంటనే కువైట్ నుంచి బయలుదేరి చెన్నైకి చేరుకున్నారు. కడలూరు జిల్లా ఎస్పీ శ్రీఅభినవ్‌కు జరిగిన సంఘటన గురించి వివరించారు. తమ కుమార్తెను రక్షించాలని ఫిర్యాదు చేశారు. అనంతరం బన్రూట్టి పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆండికుప్పానికి వెళ్లారు. కాగా అక్కడ ఇరువురు  ప్రేమికులు కనిపించలేదు. దీంతో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.(సంతాన యోగం : పురుషుల కోసం ప్రత్యేకం)

See Also | SEBI లో ఆఫీసర్ గ్రేడ్ A ఉద్యోగాలు