SBI Amrut Kalash : ఎస్బీఐ అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్ పునరుద్ధరణ.. జూన్ 30వరకు అందుబాటులో…
ఈ పథకంలో నగదు డిపాజిట్ చేసిన సాధారణ పౌరులకు 7.1శాతం, సీనియర్ సిటిజన్లకు 7.6శాతం వడ్డీ రేటు అందిస్తోంది. ఏప్రిల్ 12 నుంచి పునరుద్ధరించిన ఎస్బీఐ అమృత్ కలశ్ స్కీమ్.. జూన్ 30వరకు అందుబాటులో ఉండనుంది.

SBI Amrut Kalash
SBI Amrut Kalash : భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ).. భారత్ లో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు. ఎస్బీఐ తన లిమిటెడ్ ఆఫర్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ‘అమృత్ కలశ్ డిపాజిట్’ స్కీమ్ ను పునరుద్ధరించింది. 400 రోజుల గడువుతో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. గత నెల మార్చి ఆఖరుతోనే ఈ స్కీమ్ గడువు ముగిసినా మళ్లీ పునరుద్ధరించింది. వచ్చే జూన్ నెలాఖరు వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది.
ఈ పథకంలో నగదు డిపాజిట్ చేసిన సాధారణ పౌరులకు 7.1శాతం, సీనియర్ సిటిజన్లకు 7.6శాతం వడ్డీ రేటు అందిస్తోంది. ఏప్రిల్ 12 నుంచి పునరుద్ధరించిన ఎస్బీఐ అమృత్ కలశ్ స్కీమ్.. జూన్ 30వరకు అందుబాటులో ఉండనుంది. ఈ పథకం కింద డిపాజిట్లపై ఆదాయం పన్ను చట్టం కింద టీడీఎస్ డిడక్షన్ చేస్తారు. బ్యాంక్ బ్రాంచులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా ఈ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ లో చేరవచ్చు.
SBI: హోం లోన్ వడ్డీరేట్లు పెంచేసిన ఎస్బీఐ
అయితే, ఖాతాదారులు గరిష్టంగా రూ.2 కోట్ల వరకు డిపాజిటివ్ చేసుకునే అవకాశం ఉంది. స్వల్ప కాలిక లక్ష్యంతో డిపాజిట్ చేసే వారికి ఈ అమృత్ కలశ్ పథకంతో ప్రయోజనాలు ఉన్నాయి. మెచ్యూరిటీకి ముందే నగదు విత్ డ్రా చేసుకోవడంతోపాటు లోన్ సౌకర్యం కూడా కలదు.