Vande Bharat Express : ఒడిశాలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి

సమాచారం అందుకున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ భద్రతా విభాగం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు ప్రభుత్వ రైల్వే పోలీసులను అప్రమత్తం చేసింది. కటక్ నుంచి ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Vande Bharat Express : ఒడిశాలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి

Vande Bharat train

Updated On : November 27, 2023 / 4:11 PM IST

Stones Pelted At Vande Bharat Express : దేశంలో మరోసారి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. తాజాగా ఒడిశాలో రూర్కెలా-భువనేశ్వర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరగ్గా కిటికీలు దెబ్బతిన్నాయి. ఆదివారం ఒడిశాలో రూర్కెలా-భువనేశ్వర్ (20835) రైలును లక్ష్యంగా చేసుకుని దుండగులు రాళ్ల దాడి చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని దెంకనల్-అంగుల్ రైల్వే సెక్షన్‌లో మెరమండలి మరియు బుధపాంక్ మధ్య ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటనలో రైలు ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ కోచ్‌ కిటికీలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ ఎస్కార్టింగ్ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ భద్రతా విభాగం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు ప్రభుత్వ రైల్వే పోలీసులను అప్రమత్తం చేసింది. కటక్ నుంచి ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Kerala: వందే భారత్ రైలుపై పోస్టర్లు అంటించి కాంట్రవర్సీకి కాలు దువ్విన కాంగ్రెస్

ఈ ఘటనపై స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రైలుపై రాళ్ల దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపింది. స్థానిక పోలీసుల సమన్వయంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ భద్రతా విభాగం నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయని వెల్లడించింది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును లక్ష్యంగా రాళ్ల దాడి చేయడం దేశంలో ఇదే మొదటిసారి కాదు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే, ఇప్పటి వరకు జరిగిన ఘటనల్లో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Woman Killed : ఒడిశాలో దారుణం.. మహిళను హత్య చేసి, మృతదేహాన్ని 31 ముక్కలుగా నరికారు

భోపాల్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి
గతంలో భోపాల్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగింది. జూలైలో ఆగ్రా రైల్వే డివిజన్ సమీపంలో భోపాల్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లు విసిరారు. రైలు కోచ్ అద్దాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. అయితే, రాళ్ల దాడి ఘటనలో ఏ ఒక్క ప్రయాణీకులకు ఎలాంటి హాని జరగలేదన్నారు. రైల్వే వర్గాల సమాచారం ప్రకారం ఆగ్రా రైల్వే డివిజన్‌లోని మానియా మరియు జాజౌ స్టేషన్ల మధ్య రైలులో ఈ సంఘటన జరిగింది.

యూపీలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై దాడి
గతంలో ఉత్తరప్రదేశ్‌లో కూడా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై దాడి జరిగింది. ఈ ఏడాది ఆగస్టులో మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, గోరఖ్‌పూర్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లు రువ్వడంతో దాని అద్దాలు పగిలిపోయాయి. రైలు గోరఖ్‌పూర్ నుంచి లక్నో వెళ్తుండగా బారాబంకిలోని సఫేదాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

స్వదేశీ ఇంజనీర్లతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తయారీ
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది భారతీయ రైల్వే నిర్వహించే మధ్యస్థ దూర రైలు సర్వీస్. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ మాదిరిగానే, ఇది 10 గంటల కంటే తక్కువ వ్యవధిలో ఉన్న భారతీయ నగరాలను కలుపుతూ పగటిపూట సేవలు అందిస్తోంది. గతంలో ట్రైన్ 18గా పిలిచే ఈ రైలు సెట్‌ను ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ డిజైన్ చేసి తయారు చేసింది. రైలు 18కి ‘వందే భారత్’ అని పేరు పెట్టారు. దీన్ని పూర్తిగా భారతీయ ఇంజనీర్లచే భారతదేశంలో రూపొందించారు. దీనికి ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ అని పేరు పెట్టారు. దీన్ని తక్కువ ధరతో కార్యాచరణ ఆప్టిమైజేషన్ కోసం తయారు చేశారు. 16 కోచ్‌లతో కలిగిన వందే భారత్ రైలు ధర దాదాపు రూ.115 కోట్లుగా ఉంటుంది.