Stray Dog Bites 40 People In 2 Hours : వీధికుక్క వీరంగం..2 గంటల్లో 40మందిపై దాడి, క్రిక్కిరిసిపోయిన ఆస్పత్రి ఎమర్జన్సీ వార్డు

వీధికుక్క వీరంగం సృష్టించింది. కేవలం రెండు గంటల్లో 40మందిపై దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతంలో ఆస్పత్రి ఎమర్జన్సీ వార్డు నిండిపోయింది.

Stray Dog Bites 40 People In 2 Hours : వీధికుక్క వీరంగం..2 గంటల్లో 40మందిపై దాడి, క్రిక్కిరిసిపోయిన ఆస్పత్రి ఎమర్జన్సీ వార్డు

Stray Dog Bites 40 People In 2 Hours

Updated On : December 30, 2022 / 12:48 PM IST

Stray Dog Bites 40 People In 2 Hours : కుక్కలు బాబోయ్ కుక్కలు.. వీధికుక్కలు కనిపిస్తేనే హడలిపోతున్నారు జనాలు. అదే జరిగింది రాజస్థాన్ రాష్ట్రంలో. ఓ వీధికుక్క వీరంగానికి ఆస్పత్రి క్యూ కట్టారు జనాలు. ఒకే ఒక్క వీధి కుక్క ఏకంగా 40మందిపై దాడి చేసింది. ఈ వీధి కుక్క వీరంగానికి ఆ ప్రాంతంలో ఆస్పత్రి ఎమర్జీన్సీ వార్డు నిండిపోయింది. కేవలం రెండు అంటే రెండే గంటల్లో 40మందిపై దాడి చేసింది ఓ వీధి కుక్క. దీంతో కుక్క కరిచిన బాధితులతో ఆ ప్రాంతాల్లో ఆస్పత్రీ నిండిపోయింది. కుక్కలు కరిచాయని వస్తున్న జనాలను చూసి ఆస్పత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఏకంగా ఇంతమందా? అంటూ ఆశ్చర్యపోయారు.వారందనికి చికిత్స అందించటంలో బిజీ అయిపోయారు.

బర్మర జిల్లాలోని కల్యాణ్‌పూర్‌ ప్రాంతంలో ఓ వీధికుక్క వీరంగం సృష్టించింది. కేవలం 2గంటల వ్యవధిలోనే మొత్తం 40 మందిపై దాడి చేసి గాయపరిచింది. దీంతో వారంతా స్థానిక ఆసుపత్రికి క్యూ కట్టడంతో అక్కడ ఎమర్జెన్సీ వార్డు కుక్కదాడి బాధితులతో కిక్కిరిసిపోయింది. ఆ కుక్కకు ఏమైందో ఏమోగానీ ఇంత దారుణంగా దాడి చేసేసరికి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బయటకు రావటానికి హడలిపోతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక మున్సిపల్‌ అధికారులు రంగంలోకి దిగారు. ఆ వీడికుక్క కోసం వెతికే పనిలో పడ్డారు. రెండు బృందాలు గాలించి ఆ కుక్కను ఎట్టకేలకు పట్టుకున్నారు.