ఓటు వేయండి : పెట్రోల్, డీజిల్ పై 50 పైసలు డిస్కాంట్ పొందండి
దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచటానికి, ఓటర్ల లో అవగాహన కల్పించటానికి ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచటానికి, ఓటర్ల లో అవగాహన కల్పించటానికి ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ: దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచటానికి, ఓటర్ల లో అవగాహన కల్పించటానికి ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పోలింగ్ జరిగే రోజు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటే వారికి పెట్రోలు, డీజిల్ పై లీటరుకు 50 పైసలు రాయితీ ఇస్తామని అసోసియేషన్ ప్రకటించింది.
Read Also : ఇప్పుడు ఏమంటారు డూడ్స్ : సీఎం పట్నాయక్ Fitness మంత్రా
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ఓ పండుగ లాంటిదని దీనికి తమ వైపు నుంచి భాగస్వామ్యం అందిస్తున్నామని ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజయ్ బన్సల్ చెప్పారు. ప్రజలంతా తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకే తమ అసోసియేషన్ సభ్యులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.
ఎవరైనా ఓటువేసి, వేలిపై సిరా గుర్తు చూపిస్తే వారికి ఇంధనంపై లీటరుకు 50 పైసలు రాయితీ ఇవ్వనున్నారు. వినియోగదారులు ఓటు వేసిన సిరా గుర్తు చూపించటంతో పాటు వారి పేరు ఫోన్ నెంబరు పెట్రోల్ బంకు లో సిబ్బందికి ఇవ్వాల్సి ఉంటుంది. పోలింగ్ జరిగే అన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సదుపాయం కల్పించనున్నారు.
Read Also : మేనిఫెస్టోలో కీలక అంశాలు చెప్పిన చంద్రబాబు