కట్టుకున్న ప్రేమ ఇదే కదా: సైకిల్‌పై 120కిలోమీటర్లు భార్యతో..

ప్రపంచవ్యాప్తంగానూ.. దేశవ్యాప్తంగానూ ఇప్పుడు ఎక్కడ చూసినా లాక్ డౌన్.. అయితే ప్రేమలు మాత్రం లాక్ అవ్వలేవుగా.. కట్టుకున్న భార్య మీద ప్రేమ ఓ వ్యక్తిని 65ఏళ్ల వయస్సులో 120కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కేలా చేసింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా.. కథ తెలుసుకున్న ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణంకు చెందిన అరివలగన్ (65) అనే రైతు భార్య మంజుల(60) క్యాన్సర్‌తో కొంతకాలంగా బాధ పడుతున్నారు. ఆమెకు జిప్మర్‌లో చికిత్స అందిస్తుండగా.. తరచూ ఆమెకు కీమో థెరపీ అందించవలసి ఉంది. లాక్‌డౌన్ అమలులో ఉండటంతో బస్సులు లేవు. ప్రైవేటు అంబులెన్సుకు చెల్లించుకునే స్తోమత వారికి లేదు.
ఈ క్రమంలో ఏమి చెయ్యాలో తెలియక వేకువ జామున ఇంటి నుంచి సైకిల్‌పై భార్యను ఎక్కించుకుని పుదుచ్చేరిలోని జిప్మర్‌కు బయలుదేరాడు ఆ రైతు. ఒక పగలు, ఒక రాత్రి సైకిల్ మీద ప్రయాణం చేసి పుదుచ్చేరిలో ఆమెకు చికిత్స చేయించాడు అరివలగన్.(ఇండియాలో కరోనా టెస్టుల్లో కొత్త టెక్నిక్.. అందరి బ్లడ్ శాంపుల్స్ ఒకేసారి)
జిప్మర్‌లోకి సైకిల్‌పై తన భార్యను తీసుకుని వచ్చిన అరివలగన్‌ను చూసిన అక్కడి డాక్టర్లు ఆశ్చర్యపోయి, మంజులకు వైద్య పరీక్షలు చేయించిన అనంతరం.. అంబులెన్స్‌లో కుంభకోణంకు వారిని పంపించారు.