Tamilnadu Traffic Police : శభాష్‌ పోలీసన్న.. ఒక చేతిలో పసిపాప.. మరో చేతితో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ.. వీడియో వైరల్!

శభాష్ పోలీసన్నా.. డ్యూటీలో లేకున్నా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు తమిళనాడుకు చెందిన కానిస్టేబుల్ మణికందన్.. ఒక చేత్తో పసిపాపను ఎత్తుకుని మరో చేత్తో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ అందరితో శభాష్ అనిపించుకున్నాడు.

Tamilnadu Traffic Police : శభాష్‌ పోలీసన్న.. ఒక చేతిలో పసిపాప.. మరో చేతితో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ.. వీడియో వైరల్!

Updated On : February 12, 2024 / 11:43 PM IST

Tamilnadu Traffic Police : డ్యూటీలో ఉన్నా లేకున్నా కర్తవ్యమే ముఖ్యం.. యూనిఫాంలో ఉంటేనే డ్యూటీ చేయాలి అనేది లేదు.. అత్యవసర పరిస్థితుల్లోనూ తన వృత్తిధర్మాన్ని తూచా తప్పకుండా పాటించేవాడే అసలైన పోలీసుని నిరూపించాడో పోలీసు.. అతడే తమిళనాడుకు చెందిన కానిస్టేబుల్ మణికందన్.. ఇప్పుడు ఈ పోలీసన్నా నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాడు. అందరితో శభాష్ పోలీసన్నా అని పిలిపించుకుంటున్నాడు.

ఇంతకీ మణికందన్ ఏం చేశారంటే.. తమిళనాడులోని తిరుచ్చి-నాగై జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వచ్చేపోయే వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఆ సమయంలో ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా అందుబాటులో లేరు. వాహనదారులు సైతం ఎలాపడితే అలా వాహనాలతో దూసుకుపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.

Read Also : Viral Video: ఆసుపత్రి క్యాంపస్‌లో వైద్య విద్యార్థులు ఖతర్నాక్ డ్యాన్స్.. ఆపై 38 మంది సస్పెన్షన్

అదే సమయంలో అటుగా కానిస్టేబుల్ మణికందన్ తన ఫ్యామిలీతో కలిసి షాపింగ్‌కు వెళ్తున్నాడు. పైగా ఆరోజు తాను డ్యూటీలో కూడా లేడు. అదే ట్రాఫిక్‌లో తాను కూడా చిక్కుకున్నాడు. అప్పటికే తన చేతిలో ఏడాదిన్నర పసిపాప ఉంది. ఒకవైపు చేతిలో పాప.. మరోవైపు ట్రాఫిక్ జామ్ ఉండటంతో ఎలాగైనా పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలనుకున్నాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగాడు. ఒక చేత్తో పసిపాపను చంకలో ఎత్తుకుని మరో చేత్తో ట్రాఫిక్ క్లియర్ చేశాడు.

అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ల సాయం తీసుకుని వాహనదారులకు సూచనలు చేస్తూ ఎట్టకేలకు ట్రాఫిక్‌ను అదుపులోకి తీసుకొచ్చాడు. ఇదంతా అక్కడ ఉన్నవారు ఎవరో ఫోన్లో వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కానిస్టేబుల్ మణికందన్ కర్తవ్యాన్ని చూసి శభాష్ పోలీసన్నా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది నెటిజన్లు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి డ్యూటీతో పనిలేదని అంటున్నారు. మీరు కూడా ఈ వీడియో చూసేయండి..