TB Patients: ఆ వ్యాధిగ్రస్తులు కోలుకున్నా ముప్పు తప్పదు.. ప్రతి ఆర్నెళ్లకు పరీక్షించుకోవాలి!

క్షయవ్యాధికి సంబంధించిన చికిత్సను విజయవంతంగా పూర్తిచేసుకున్న తర్వాతకూడా రోగులకు ముప్పుతప్పదని, వారిలో చాలా మంది పలు రకాల అనారోగ్యాల కారణాలవల్ల అకాల మరణం చెందుతున్నారని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) ఆధ్వర్యంలోని జాతీయ క్షయ పరిశోధనా కేంద్రం (ఎన్ఐఆర్టీ) జరిపిన అధ్యయనంలో వెల్లడయింది

TB Patients: ఆ వ్యాధిగ్రస్తులు కోలుకున్నా ముప్పు తప్పదు.. ప్రతి ఆర్నెళ్లకు పరీక్షించుకోవాలి!

Tb

Updated On : July 10, 2022 / 9:40 PM IST

TB Patients: క్షయవ్యాధికి సంబంధించిన చికిత్సను విజయవంతంగా పూర్తిచేసుకున్న తర్వాతకూడా రోగులకు ముప్పుతప్పదని, వారిలో చాలా మంది పలు రకాల అనారోగ్యాల కారణాలవల్ల అకాల మరణం చెందుతున్నారని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) ఆధ్వర్యంలోని జాతీయ క్షయ పరిశోధనా కేంద్రం (ఎన్ఐఆర్టీ) జరిపిన అధ్యయనంలో వెల్లడయింది. 2025 నాటికి టీబీ వ్యాధిని అంతం చేయాలన్నది ఎన్ఐఆర్టీ లక్ష్యం. 2030 ప్రపంచ SDG లక్ష్యం కంటే ఐదు సంవత్సరాల ముందు, భారతదేశంలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (NTEP) ద్వారా క్షయవ్యాధికి వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తోంది.

Viral Video : రెస్టారెంట్‌ను ధ్వంసం చేసిన ముగ్గురు మహిళలు.. ఎందుకంటే..?

క్షయ వ్యాధిసోకి కోలుకున్న వారిని ఎన్టీఈపీ ఆధ్వర్యంలో ధీర్ఘకాలంగా పరీక్షించారు. మొత్తం 4,022 మంది టీబీ రోగులపై అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీబీ రోగులకు ధీర్ఘకాలంగా విజయవంతంగా చికిత్స తీసుకున్నప్పటికీ వారిలో అకాల మరణాలు ఎక్కువశాతం సంభవిస్తున్నాయని అధ్యయనం ద్వారా గుర్తించారు. టీబీ నిర్ధారణ, చికిత్స పొందిన వారిలో టీబీ బారిన పడని వారి కంటే రెండు రెట్లు మరణం ముప్పు ఎక్కువ అని పేర్కొన్నారు. ఇందులో మహిళల కంటే పురుషుల్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం ద్వారా గుర్తించారు.

Telanganan Corona Cases: తెలంగాణలో కొనసాగుతున్న కొవిడ్ ఉధృతి.. కొత్తగా ఎన్ని కేసులంటే?

పరిశోధనల ప్రకారం.. టీబీ సోకి చికిత్స పొందిన వారిలో 1,000 మందికి 6.15 మంది, టీబీ సోకని వారిలో 1,000 మందికి 1.52 మంది అకాల మరణం పొందారు. టీబీ సంబంధిత మరణాలను తగ్గించే చర్యల్లో భాగంగా.. ధూమపానం, మద్యపానం చేసేవారికి, ఇతర అలవాట్ల ద్వారా టీబీ సోకుతుందని, దానిబారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సాధారణ కౌన్సెలింగ్ లేదా అవగాహన కల్పించాలని ఎన్ఐఆర్టీ డైరెక్టర్ డాక్టర్ పద్మ ప్రియదర్శిని పేర్కొన్నారు. అయితే టీబీ వ్యాధి చికిత్స అంనంతరం కోలుకున్న వారు రెండేళ్లపాటు ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి పరీక్షించుకోవాలని సిఫార్సు చేశారు.