Bihar : విద్యార్ధుల కోసం పడవల్లో తిరుగుతున్న ఉపాధ్యాయులు..వాటిమీదనే పాఠాలు

విద్యార్ధుల కోసం ఉపాధ్యాయులు పడవల్లో తిరుగుతున్నారు. పడవలకే బోర్డులు కట్టి పాఠాలు చెబుతున్నారు.

Bihar : విద్యార్ధుల కోసం పడవల్లో తిరుగుతున్న ఉపాధ్యాయులు..వాటిమీదనే పాఠాలు

Teachers Hold Classes On Boats Amid Flood In Bihars Katihar

Updated On : September 7, 2021 / 10:40 AM IST

classes on boats : దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. భారీ వ‌ర్షాలతో వరద నీటితో వీధుల్ని నదుల్ని తలపిస్తున్నాయి. అసలే కరోనా దాదాపు రెండేళ్లుగా మూత పడిన స్కూళ్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. భయం భయంగానే విద్యార్ధులు కూడా స్కూళ్లకు వస్తున్నారు. కానీ ఇంతలోనే భారీ వర్షాలతో స్కూళ్లల్లోకి కూడా వరదనీరు చేరుకోవటంతో విద్యార్ధులు మరోసారి చదువుకు దూరమవ్వాల్సి వస్తోంది. దీంతో ఓ ఉపాధ్యాయుడు వినూత్నంగా ఆలోంచి విద్యార్ధులకు పడల్లోనే పాఠాలు చెబుతున్నారు. నీటిపై తేలియాడే పడవలో విద్యార్ధులు కూర్చుని ఉంటే వారి ఎదురుగా నిలబడి ఆ ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బీహార్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తాయి. దీంతో సామాన్య‌ప్ర‌జ‌ల‌తో పాటుగా విద్యార్థులు తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క‌రోనా వల్ల మూత పడ్డ స్కూళ్లు బీహార్ లో గ‌త నెల రోజుల నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ స్కూళ్లు ప్రారంభ‌మైన కొన్ని రోజుల‌కే వ‌ర‌ద‌లు ముంచెత్త‌డంతో ఉపాధ్యాయులు ప‌డ‌వ‌ల్లోనే పిల్ల‌ల‌కు పాఠాలు చెబుతున్నారు.దీంతో ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారిని పడవల్లో ఎక్కించుకుని పాఠాలు చెబుతున్నారు. పడవకు బోర్డు కట్టి ఆ బోర్డుమీదే పాఠాలు రాసి బోధిస్తున్నారు. విద్యార్ధుల కోసం ఇలా చేస్తున్న ఉపాధ్యాయుల్ని ప్రజలు అభినందిస్తున్నారు.

క‌తియార్ జిల్లాలోని మ‌హ‌నీహ‌రి ప్రాంతంలో ఉపాధ్యాయులు ప‌డ‌వ‌ల్లోనే విద్యార్ధులకు పాఠాలు చెబుతున్నారు. క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టికే విద్య‌కు విద్యార్థులు దూరం అయ్యార‌ని..ఇప్పుడీ వ‌ర‌ద‌ల వల్ల మరోసారి విద్యార్ధులు విద్యకు దూరం కాకూడదనే ఉద్ధేశ్యంతో ఇలా పడవల్లో పాఠాలు చెబుతున్నామని పంక‌జ్ కుమార్ అనే ఉపాధ్యాయుడు తెలిపారు. వరదనీరు తమ ప్రాంతంలో ఆరు నెలల పాటు ఉంటోందని..అసలే కరోనా వైరస్ మహమ్మారి వల్ల పిల్లలు బాగా నష్టపోయారని..దీనికితోడు వరదల వల్ల విద్యార్థులు నష్టపోకూడదని వారిని పడవల్లో ఎక్కించుకొని దానిలోనే పాఠాలు చెబుతున్నామని ఉపాధ్యాయుడు పంకజ్ కుమార్ తెలిపారు.

ఈ పడవ పాఠాల గురించి అమీర్ లాల్ అనే విద్యార్ధి మాట్లాడుతు..నేను 10th క్లాస్ చదువుతున్నారు. కరోనా వల్ల ఆన్ లైన్ క్లాసులు చెబుతున్నా..సిలబస్ పూర్తి కాలేదు. దీంతో ఉపాధ్యాయులు మాకోసం పడవలపై వచ్చి పడవల్లోనే మాకు క్లాసులు చెబుతున్నారని దీంతో మేం చదువుకుంటున్నాం అని తెలిపాడు.కాగా..గంగానదితోపాటు దాని ఉపనదులు వరదలతో ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి.దీంతో ఆయా ప్రాంతాల్లో వరదలు ముంచెత్తున్నాయి.