ఉగ్రదాడి : అమర జవానులకు ఆటోవాలా నివాళి : ఫ్రీ సర్వీస్

చండీగఢ్: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై దేశంలోని ప్రజలంతా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎంతోమంది అమర జవానులకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో చండీగఢ్‌కు చెందిన అనిల్‌కుమార్ అనే ఓ ఆటోవాలా తన ఆటోపై ఓ పోస్టర్ అతికించాడు. ‘ఏ రోజైతే భారత ప్రభుత్వం పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటుందో..అప్పుడే తాను పండుగ చేసుకుంటాననీ రాసుకున్నాడు. నిజమైన ఆనందం ఆరోజునేనన్నాడు.
అమరులైన జవాన్లకు ఏదో ఒకటి చేయడం ద్వారా నిజమైన నివాళి అర్పించినట్లని అభిప్రాయపడిన అనిల్ 30 రోజుల పాటు ఆటోలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తాను’ అని కూడా రాశారు. సరిహద్దులో ఉగ్రదాడి జరిగిందని తెలుసుకోగానే మనసు కలచివేసిందనీ..ఉగ్రవాదులపై పట్టరాని ఆగ్రహం కలిగిందని తెలిపారు. ఉరీ ఘటన సమయంలో తాను ఏపీ చేయలేకపోయామని..ఇప్పుడు ఉగ్రవాదులతో పాటు..దాయాది దేశమైన పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తీవ్ర ఉద్వేగంతో తెలిపాడు.