Mumbai Bombs : ముంబైలో బాంబులు అమర్చినట్లు ఫోన్ కాల్స్..తీరా చూస్తే!
ముంబైలో ఓ ఆగంతకుడు పోలీసులను పరుగులు పెట్టించాడు. నగరంలోని నాలుగు కీలక ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు పోలీసులకు ఫోన్ చేశాడు.

Mumbai
Mumbai bombs phone calls : ముంబైలో ఓ ఆగంతకుడు పోలీసులను పరుగులు పెట్టించాడు. నగరంలోని నాలుగు కీలక ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో ఉలిక్కి పడ్డ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీఎస్ ఎమ్ టీ, మైకుల్లా స్టేషన్, దాదార్ స్టేషన్, అమితాబ్ బచన్ ఇంట్లో బాంబులు పెట్టినట్లు ఫోన్ రావడంతో పోలీసులు అన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
పోలీసులు హుటాహుటిన సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆగంతకుడు చెప్పిన ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే పోలీసులు ఫేక్ ఫోన్ కాల్ గా గుర్తించారు. ఫేక్ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు. ఆగంతకుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.