Covid – 19 : వ్యాక్సిన్ వేసుకుంటే రిస్క్ 0.5 శాతమే!.. ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొందరికి కరోనా సోకుతుంది. అయితే వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం చాలా తక్కువగా ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. చాలామంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కరోనా బారినపడుతున్నట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.

Covid 19
Covid – 19 : వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొందరికి కరోనా సోకుతుంది. అయితే వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం చాలా తక్కువగా ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. చాలామంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కరోనా బారినపడుతున్నట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. కాగా కోవిడ్ టీకాలు తీసుకున్న తర్వాత కరోనా సోకిన వారిపై ఐసీఎంఆర్ అధ్యయనం చేసింది.
మార్చి నుంచి జూన్ మధ్య దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో 1000 మంది కరోనా పేషేంట్ల పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలించింది. ఈ పరిశోదల వివరాలను తాజాగా విడుదల చేసింది. టీకా తీసుకున్న తర్వాత కరోనా సోకినా వారిలో తీవ్రమైన లక్షణాలేమి కనిపించడం లేదని తెలిపింది. సాధారణ జ్వరం, జలుబు ఉంటున్నాయని.. మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోతుందని వివరించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా బారినపడినవారిలో 99.5 శాతం మంది సురక్షితంగా బయటపడుతున్నారని తెలిపింది.
వ్యాక్సిన్ తీసుకున్న 39 రోజుల తర్వాత కరోనా సోకినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా సోకిన 70 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు లేవని.. మరికొందరిలో మాత్రం సాధారణ లక్షణాలైన జ్వరం, జలుబు, దగ్గు కనిపించాయని తెలిపారు. ఐసీఎంఆర్ పరిశీలించిన బాధితుల్లో 85 శాతం మంది డెల్టా వేరియంట్ సోకినట్లు గుర్తించారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కరోనా సోకిన వారిలో 22 శాతం మంది ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుందని వివరించారు.
కరోనా టీకా తీసుకుంటే చాలా వరకు ముప్పు తగ్గుతుందని వివరించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు టీకా తీసుకోవడం వలన చాలా మేలు జరుగుతుందని వివరించారు. వీరిలో 43 శాతం మంది మాత్రమే ఆసుపత్రికి పోవాల్సి వస్తుందని తెలిపాడు.