Supreme Court On Firecrackers : దీపావళి వేళ..బాణసంచా నిషేధంపై సుప్రీం క్లారిటీ

దీపావళి వేడుకలు దగ్గరపడుతున్న సమయంలో ఫైర్‌ క్రాకర్స్ విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బాణసంచాపై

Supreme Court On Firecrackers : దీపావళి వేళ..బాణసంచా నిషేధంపై సుప్రీం క్లారిటీ

Crackers

Updated On : October 29, 2021 / 9:25 PM IST

Supreme Court On Firecrackers దీపావళి వేడుకలు దగ్గరపడుతున్న సమయంలో ఫైర్‌ క్రాకర్స్ విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బాణసంచాపై పూర్తి స్థాయిలో నిషేధం విధించలేదని.. బేరియం సాల్ట్ ఉపయోగించిన క్రాకర్స్ పై మాత్రమే నిషేధం ఉంటుందని జస్టిస్ ఎంఆర్​ షా, జస్టిస్ ఏ ఎస్​ బోపన్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది.

రాష్ట్రాలు, ఏజెన్సీలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటించాలని, అతిక్రమిస్తే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది.  ఉత్సవాల పేరుతో పర్యావరణానికి హానికరమైన బాణాసంచా కాల్చడానికి వీల్లేదని సుప్రీం ధర్మాసనం తేల్చిచేప్పింది. వేడుకల పేరుతో ఇతరుల ఆరోగ్యాన్ని, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, పిల్లల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం కుదరదని, ఈ విషయమై భారత రాజ్యాంగంలోని 21వ అధికరణ వారికి రక్షణ కల్పిస్తోందని చెప్పింది.

బాణసంచా తయారీ, వినియోగం, నిషేధిత బాణసంచా అమ్మకాలకు సంబంధించి కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, స్థానిక కేబుల్ సర్వీసుల ద్వారా ప్రచారం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఎవరూ ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ALSO READ Covaxinకు అత్యవసర అనుమతి ఆలస్యం..WHO కీలక వ్యాఖ్యలు