బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు : దేశంలో ఇవే చివరి ఎన్నికలు

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.మరికొన్ని రోజుల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మోడీ సునామీ సృష్టిస్తారని,ఆ తర్వాత దేశంలో ఎన్నికలు ఉండవని అన్నారు.శుక్రవారం(మార్చి-15,2019) బీజేపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… 2014లో లాగానే ఈ ఎన్నికల్లో మోడీ సునామీ సృష్ఠించడం ఖాయం.2024లో దేశంలో ఎన్నికలు ఉండవని తాను భావిస్తున్నట్లు తెలిపారు.ఈసారి మాత్రమే ఈ దేశంలో ఎన్నికలు జరుగుతాయన్నారు. పూర్తి నిజాయితీతో దేశం పేరుతో ఈ ఎన్నికల్లో తాము దేశం పేరుతో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
మోడీని ప్రధాని కాకుండా ఆపడం ఎవరితరం కాదన్నారు. 2014లో వచ్చిన ఫలితాలకంటే ఈ ఎన్నికల్లో బీజేపీకి మరింత మెజార్టీ వస్తుందన్నారు. చాలామంది బీజేపీని ఓడించేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కానీ ప్రజలందరూ మోడీ ఉంటేనే దేశం ఉంటుందని చెబుతున్నారని అన్నారు.ఈ ఎన్నికలు ఏ పార్టీ మీదనో,వ్యక్తి పేరు మీదనో జరుగవని,దేశం పేరు మీద జరుగుతాయని అన్నారు.