ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్? రికార్డు స్థాయిలో కేసులు

  • Published By: sreehari ,Published On : October 29, 2020 / 03:08 PM IST
ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్? రికార్డు స్థాయిలో కేసులు

Updated On : October 29, 2020 / 3:27 PM IST

Third wave of Covid-19 in Delhi : దేశ రాజధాని ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఢిల్లీలో కరోనా మూడో దశకు చేరుకున్నట్టుగా కనిపిస్తోంది. ఢిల్లీలో గురువారం (అక్టోబర్ 29) తొలిసారిగా కరోనా కొత్త కేసులు 5,000లకు పైగా నమోదు అయ్యాయి.



ఈ నేపథ్యంలో కరోనా తీవ్రతపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ స్పందించారు. ఇప్పుడు కరోనా మూడో దశలోనే ఉందని ఆయన అన్నారు. బుధవారం 5,673 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసులు 370,014లకు చేరగా ఇప్పటివరకూ 6,396 మంది కరోనాతో మృతిచెందారు.



https://10tv.in/second-wave-in-india-start-of-the-fourth-global-covid-19-wave/
ఢిల్లీలో కరోనా మూడో వేవ్ మొదలైనట్టుగా కనిపిస్తోంది. మరో వారం ఆగితే గాని కరోనాపై ఒక స్పష్టత వచ్చేలా లేదు. దీనిపై స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి జైన్.. ఢిల్లీ కరోనా మూడో దశలోనే ఉందని మీడియాకు వెల్లడించారు.



కరోనా కట్టడిలో కొన్ని వ్యూహాత్యక చర్యలు చేపట్టాల్సి ఉందని, ఏ వ్యక్తికి అయినా పాజిటివ్ వస్తే.. ఆ ఇంట్లో కుటుంబ సభ్యులందరితో పాటు వారిని కలిసివారికి కూడా కరోనా పరీక్షలు చేయాలన్నారు. ఇది ఒకసారి కాదన్నారు.



నాలుగు నుంచి ఐదు రోజుల్లో రెండు సార్లు చేయాలని సూచించారు. ఒక్క రోజులో ఢిల్లీలో 5, 673 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అంతకు ముందు రోజున ఢిల్లీలో 4,853 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.


సెప్టెంబర్ 16 నుంచి ఢిల్లీలో 4,473 కేసులతో పోలిస్తే ఒక్క రోజులో వరుసగా రెండో రోజున రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో వరుసగా రోజుకు 4వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.