Stampede: చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాటకు కారణం ఇదే..! వెలుగులోకి షాకింగ్ వీడియో..
తొక్కిసలాట ఘటనతో స్టేడియం నుంచి వెళ్లిపోవాలని అభిమానులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Stampede: ఐపీఎల్ 2025 ట్రోఫీ విన్నర్ ఆర్సీబీ విజయోత్సవంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆర్సీబీ విక్టరీ పరేడ్ ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకు తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11మంది చనిపోయారు. 33మంది గాయపడ్డారు. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఆర్సీబీ జట్టుకు చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తమ అభిమాన ప్లేయర్లను చూసేందుకు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో చిన్నస్వామి స్టేడియానికి తరలివచ్చారు. వేలాదిగా మంది అక్కడికి చేరుకున్నారు. స్టేడియం గేట్లను తోసుకుని దూసుకెళ్లేందుకు అభిమానులు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
స్టేడియానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే తొక్కిసలాట జరిగింది. అందులో ఊపిరి ఆడక కొందరు చనిపోయారు. స్టేడియం దగ్గర సరైన సమయంలో గేట్లు తెరవకపోవడం వల్లే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు గేట్లు తోసుకుంటూ ముందుకు దూసుకొచ్చారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని సమాచారం.
క్రౌడ్ ను అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. కేవలం పాస్ లు ఉన్న వారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తామని అధికారులు చెప్పారు. అభిమానులంతా చిన్నస్వామి స్టేడియం వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో స్టేడియం పరిసరాలు జన సమూహంతో జామ్ అయ్యాయి. వేలాది మంది వస్తారని అనుకుంటే లక్షల మంది వచ్చేశారని, వారిని అదుపు చేయడం తమకు సాధ్యం కాలేదని పోలీసులు వాపోయారు.
తొక్కిసలాట ఘటనతో స్టేడియం నుంచి వెళ్లిపోవాలని అభిమానులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. చిన్నస్వామి స్టేడియం పరిసరాల్లో మెట్రో సేవలు నిలిపివేశారు. తొక్కిసలాటలో సృహ తప్పి పడిపోయిన వారికి పోలీసులు వెంటనే సీపీఆర్ చేశారు. కానీ, వారి ప్రాణాలను కాపాడలేకపోయారు.
Be safe guys!! If you can avoid 🙏🙏
Do watch in your home please 🥺
avoid heading to the Chinnaswamy Stadium, as reports suggest possible stampede-like situations.#RCBvsPBKSfinal #Rcbvspbks pic.twitter.com/NijBTBvnzN
— Pranooth Gowda (@pranooth_mp) June 4, 2025
🚨 TRAGIC NEWS! A stampede-like situation has been reported at Chinnaswamy Stadium as fans gathered to celebrate RCB’s win.
— 07 people, including a child, have reportedly lost their lives. pic.twitter.com/57SZJ5vAWy
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 4, 2025
Just before the stampede, a massive chaos was witnessed outside the Chinnaswamy Stadium in Bengaluru. #RCB #Stampede #Bengaluru https://t.co/dPyGtgw0Mi pic.twitter.com/87kFwSBg4O
— Vani Mehrotra (@vani_mehrotra) June 4, 2025