Fireworks Blast : తమిళనాడులో బాణాసంచా పేలుడు.. ముగ్గురు మృతి

తమిళనాడులో బాణాసంచా దుకాణంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో షాప్‌ యాజమాని మోహన్‌తో పాటు అతని ఇద్దరు మనవళ్లు అనుశ్‌, తేజస్‌ అక్కడికక్కడే మృతి చెందారు.

Fireworks Blast : తమిళనాడులో బాణాసంచా పేలుడు.. ముగ్గురు మృతి

Fireworks Blast

Updated On : April 18, 2021 / 9:43 PM IST

three kills in Fireworks blast : తమిళనాడులోని వెల్లూరు జిల్లా లతేరి బస్టాండ్‌ సమీపంలోని బాణాసంచా దుకాణంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో షాప్‌ యాజమాని మోహన్‌తో పాటు అతని ఇద్దరు మనవళ్లు అనుశ్‌, తేజస్‌ అక్కడికక్కడే మృతిచెందారు.

ఫైర్‌ సిబ్బంది ఆలస్యంగా ఘటన స్థలానికి రావడంతో 10 బైకులు ధ్వంసమయ్యాయి. చిన్నారులు మృతి చెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

దట్టమైన పొగలు చుట్టుపక్కలకు భారీగా వ్యాపించాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.