Jammu Kashmir : జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

చంద్ గామ్ లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందడంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

Jammu Kashmir  : జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

Encounter

Updated On : January 5, 2022 / 11:32 AM IST

Jammu Kashmir Encounter : జమ్మూకశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లాలోని చాంద్ గామ్ లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

చంద్ గామ్ లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందడంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు.

Omicron Kamareddy : కామారెడ్డి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు

ఘటనాస్థలిలో ఆయుధాలు, 2ఎం-4 కార్బైన్లు, ఏకే రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా దళాల కాల్పుల్లో జైషే మహమ్మద్ గ్రూప్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. మృతి చెందిన ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్తానీయుడని పేర్కొన్నారు.