Dr Gaurav Gandhi : 16,000 గుండె ఆపరేషన్లు చేసిన కార్డియాలజిస్ట్ 41 ఏళ్లకే గుండెపోటుతో మృతి

గుండెపోటు లక్షణాల గురించి ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని అవగాహన కల్పించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 16,000 గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్ గౌరవ్ గాంధీ 41 ఏళ్లకే గుండెపోటుతో మరణించటం ఆందోళన కలిగిస్తోంది.

Dr Gaurav Gandhi : 16,000 గుండె ఆపరేషన్లు చేసిన కార్డియాలజిస్ట్ 41 ఏళ్లకే గుండెపోటుతో మృతి

Cardiologist Dr Gaurav Gandhi

Cardiologist Dr Gaurav Gandhi : 16,000 వేల మందికి గుండె ఆపరేషన్లు చేసిన వారి ప్రాణాలకు కాపాడిన ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్ గౌరవ్ గాంధీ గుండెపోటుకు గురి అయి చనిపోయారు. 41 ఏళ్లకే గుండెపోటుకు గురి అయి ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కాలంలో ‘గుండెపోటు’ అనే మాట వింటేనే హడలిపోతున్నారు. గుండెపోట్లు వయస్సుతో సంబంధంలేకుండా వచ్చి క్షణాల్లోనే ప్రాణాలు తీస్తున్నాయి. నడుస్తు నడుస్తు..వ్యాయామాలు చేస్తు గుండె పట్టుకుని కుప్పకూలిపోయి క్షణాల్లోనే చనిపోతున్నారు. దీనికి వయస్సుతో సంబంధంలేకుండాపోతోంది. గుండెపోటుకు డాక్టర్, యాక్టర్ అనే తేడా ఉండదు అన్నట్లుగా ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ గౌరవ్ గాంధీ 41 ఏళ్లకే గుండెపోటుకు గురి అయిన చనిపోవటంతో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

డాక్టర్ గౌరవ్ గాంధీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. తగినంత వ్యాయామం చేస్తారు. ఆటలు ఆడతారు. శారీరకంగా, మానసికంగా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటారు. అయినా గుండెపోటుతోనే 41 ఏళ్లకే ఆయన మరణించటం ఆందోళన కలిగిస్తోంది.

Bypass Surgery : బైపాస్ సర్జరీ ఎప్పుడు అవసరం? తీవ్రమైన ఛాతీ నొప్పి ఉన్నవారందరికి ఇది అవసరమా ?
సాధారణంగా మానసిక,శారీరక ఒత్తిడి,దీర్ఘకాలిక వ్యాధులు, గుండె జబ్బు సమస్యలు ఉంటే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. అదే విషయాన్ని అమృత హాస్పిటల్ కార్డియాలజీ విభాగం చీఫ్ డాక్టర్ వివేక్ చతుర్వేది కూడా అదే చెప్పారు. ఎక్కువ పనిగంటల వల్ల మానసిక శారీరక ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలున్నాయని డాక్టర్లు కూడా అటువంటి ఒత్తిడికి గురి అవుతుంటారని తెలిపారు. కానీ ఇటీవల కాలంలో ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు కూడా గుండెపోటుతో చనిపోవటం ఆందోళన కలిగిస్తోంది. డాక్టర్ గౌరవ్ కూడా అలాగే చనిపోవటం చర్చకు దారి తీసింది.

గుజరాత్ కు చెందిన డాక్టర్ గౌవర్ గాంధీ ‘గుండెపోట్లను అరికడదాం’ అని ఫేస్‌బుక్‌లో చేస్తున్న ప్రచారంలో యాక్టివ్ గా ఉంటారు. ఆయన గత మంగళవారం (జూన్ 13,2023) ఉదయం మరణించటం పట్ల కార్డియాలజిస్టులు కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 16,000 హార్ట్ సర్జరీలు చేసి ప్రాణాలను కాపాడిన డాక్టర్ గౌరవ్ గాంధీ. అతి తక్కువ కాలంలోనే జామ్‌ నగర్‌‌లోని టాప్ కార్డియాలజిస్ట్‌గా పేరు పొందారు. అటువంటిది ఆయనే గుండెపోటుతో మరణించారు. డాక్టర్ గౌరవ్ ప్రతీరోజు వలెను సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు పేషెంట్లను చూశారు. రాత్రి సమయంలో ప్యాలెస్ రోడ్‌లో ఉన్న తన ఇంటికి వెళ్లారు. భోజనం చేశాక నిద్రపోయారు. పడుకునే సమయంలో ఆయన మామూలుగానే ఉన్నారు.

కానీ..మరుసటి రోజు ఉదయమే లేచి వ్యాయామాలు చేసుకునే ఆయన ఇంకా లేవకపోవటంతో కుటుంబ సభ్యులు ఆయన్ని లేపటానికి వెళ్లారు. 6 గంటలకు ఆయన్ని నిద్రలేపేందుకు గదిలోకి వెళ్లగా అచేతనంగా బెడ్ మీద కనిపించటంతో ఆందోళన చెందారు. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఆయన గుండెపోటుకు గురి అయినట్లుగా డాక్టర్లు గుర్తించారు. ఆయన్ని బతికించటానికి డాక్టర్లు ఎన్నో విధాలుగా యత్నించారు. రెండు మూడు గంటలపాటు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రముఖ కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ గౌరవ్ హార్ట్ ఎటాక్‌తో చనిపోవడం వైద్య వర్గాలను సైతం ఆశ్చర్యనికి ఆందోళనకు గురి చేసింది.

Kadwa Badam : రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దోహదపడే కద్వా బాదం !

జామ్‌నగర్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన గౌరవ్ గాంధీ.. అహ్మదాబాద్‌లో కార్డియాలజీలో స్పెషలైజేషన్ చేశారు. అనంతరం తన సొంతూళ్లో డాక్టర్ సేవలు అందించారు. ‘గుండెపోట్లను అరికడదాం’ అని ఫేస్‌బుక్‌లో చేస్తున్న ప్రచారంలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. పలు సూచనలు చేసేవారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతుండేవారు. 1982లో జన్మించిన డాక్టర్ గౌరవ్.. పని పట్ల అంకిత భావంతో ఉండేవారని తోటి డాక్టర్లు సైతం చెబుతుంటారు. గౌరవ్ రోజుకు 14 గంటలు పనిచేస్తారని తెలిపారు. 16 వేల యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ హార్ట్ సర్జరీలు చేశారంటేనే ఆయనకు ఎంతటి అంకితభావం ఉందో అర్థం చేసుకోవచ్చు. డాక్టర్ గౌవర్ గాంధీ భార్య దేవాన్షి గాంధీ డెంటిస్ట్‌. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.

ఇటీవలి కాలంలో మరీ ముఖ్యంగా చెప్పాలంటే కరోనా తర్వాతీ గుండెపోట్లు ఎక్కువయ్యాయి. చక్కటి ఆరోగ్యంగా ఉన్నవారు కూడా సడెన్ గా గుండెపట్టుకుని కుప్పకూలి మరణిస్తున్నారు. చిన్నారులు సైతం కార్డియాక్ అరెస్ట్ కారణంగా చనిపోతున్నారు. దీనికి కరోనా వ్యాక్సిన్లు కారణమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నాయి. భారత్ లో 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్న వారికి కూడా గుండెపోట్లు సంభవిస్తున్నాయని లెక్కలు వెల్లడిస్తున్నాయి.

Foods to Help Fight Stress : ఒత్తిడికి గురైనప్పుడు తీసుకోవాల్సి ముఖ్యమైన 5 ఆహారాలు ఇవే ?

గుండెపోటు లక్షణాల గురించి ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని అవగాహన కల్పించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అటువంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని.. చాతీనొప్పి, శ్వాస ఆడకపోవటం, ఎడమ చేయి లాగటం వంటి పలు లక్షణాలు ఉంటే వెంటనే నిపుణులను సంప్రదించాలని.. గ్యాస్ట్రిక్ సమస్యల్ని కూడా సాధారణ సమస్యలా తీసిపారేయొద్దని సూచిస్తున్నారు. నిత్యం వ్యాయామం చేయడం, ఆహారాల్లో ఉప్పు తగ్గించడం, ఆయిల్ ఫుడ్‌కి దూరంగా ఉండటం, మానసిక,శారీరక ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారా గుండె జబ్బులు నుంచి దూరంగా ఉండవచ్చని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.