Kerala River: నది మొత్తాన్ని పింక్‌గా మార్చేసిన పువ్వులు
ఇండియాలోని కేరళలో ఓ నది మొత్తం పింక్ రంగులోకి మారిపోయింది. కోజికోడ్‌లోని ఈ నది భారతదేశం వ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షిస్తుంది. గులాబీ రంగులో మారిపోయిన నది ఫోర్క్డ్ ఫ్యాన్‌వోర్ట్ పువ్వులతో నిండి ఉంది.

Kerala
Kerala River: ఇండియాలోని కేరళలో ఓ నది మొత్తం పింక్ రంగులోకి మారిపోయింది. కోజికోడ్‌లోని ఈ నది భారతదేశం వ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షిస్తుంది. గులాబీ రంగులో మారిపోయిన నది ఫోర్క్డ్ ఫ్యాన్‌వోర్ట్ పువ్వులతో నిండి ఉంది.
కళ్లకు కనిపించినంతమేర విశాలమైన పింక్ రంగుతో చూపరులను ఆకట్టుకుందని వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు.
ఈ నది ఫొటోను పోస్టు చేసి ప్రత్యేక కాంప్లిమెంట్ వెల్లడించారు.
“ఈ గ్రామానికి పర్యాటకులు తరలి వస్తున్నారని అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ఫోటోను చూస్తుంటే ఉత్సాహాన్ని, ఆశావాద భావాన్ని పెరుగుతుంది. దీన్ని నా కొత్త స్క్రీన్‌సేవర్‌గా పెట్టుకుంటున్నాను. దానికి “రివర్ ఆఫ్ హోప్” అని పేరు పెట్టుకుంటున్నా” అని కామెంట్ చేశారు.
Read Also: కేరళ ప్రాచీన విద్యతో అదరగొడుతున్న మంచు లక్ష్మి… వైరల్ అవుతున్న వీడియోలు
ఈ పింక్ నది ఫొటోలు వైరల్ అవడం తొలిసారేం కాదు. 2020లో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. అలాగే షిల్లాంగ్ రాజధాని మేఘాలయలోనూ ఈ పువ్వుల అద్భుతం కనిపించింది. ఈ సీజన్ మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి పూలు కనిపిస్తుంటాయట.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw