Konark Sun Temple : కోణార్క్ సూర్యదేవాలయంలో ఉద్రిక్తత.. గోడ దూకి ఆలయంలోకి పర్యాటకులు..!

ఒడిశాలోని పూరీ జిల్లాలో ఉన్న కోణార్క్ సూర్యదేవాలయంలో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ-టికెటింగ్ సౌకర్యంలో లోపం కారణంగా వేలాది మంది పర్యాటకులు ప్రవేశ టిక్కెట్లు పొందలేకపోయారు.

Konark Sun Temple : కోణార్క్ సూర్యదేవాలయంలో ఉద్రిక్తత.. గోడ దూకి ఆలయంలోకి పర్యాటకులు..!

Tourists Barge Into Konark Sun Temple Due To Glitch In E Ticketing System (1)

Updated On : December 28, 2021 / 9:26 PM IST

Konark Sun Temple : ఒడిశాలోని పూరీ జిల్లాలో ఉన్న కోణార్క్ సూర్యదేవాలయంలో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. యునెస్కో గుర్తింపు పొందిన కోణార్క్​ సూర్యదేవాలయానికి భారీ సంఖ్యలో పర్యాటకులు పోటెత్తారు. ఆలయ సందర్శనకు వచ్చిన పర్యాటకులతో కిటకిటలాడింది. ఈ క్రమంలో సాంకేతిక కారణాలతో ఆన్‌లైన్ బుకింగ్ అంతరాయం కలిగింది.

అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో ఆలయ యాజమాన్యం వద్ద కేవలం 3వేల టోకెన్లు మాత్రమే ఉన్నాయి. సందర్శన టికెట్ల కోసం పర్యాటకులు ఎగబడ్డారు. చాలామంది పర్యాటకులు గోడలు దూకి మరి ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగడంతో పర్యాటకులను అదుపు చేశారు. ఈ-టికెటింగ్ సౌకర్యంలో లోపం కారణంగా వేలాది మంది పర్యాటకులు ప్రవేశ టిక్కెట్లు పొందలేకపోయారు.

నివేదిక ప్రకారం.. సెలవుల సందర్భంగా వేలాది మంది పర్యాటకులు కోణార్క్‌ ఆలయాన్ని సందర్శించారు. ఈ-టికెటింగ్ సదుపాయం సర్వర్ సుమారు గంటపాటు పనిచేయలేదు. దాంతో పర్యాటకులకు ఆలయంలోకి ప్రవేశం లభించలేదు. దీనిపై ఆగ్రహించిన పర్యాటకులు ఆలయం వద్ద మోహరించిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను పక్కకు నెట్టి ఆలయంలోకి దూసుకెళ్లారు. దాంతో స్వల్ప ఉద్రికత్త పరిస్థితి నెలకొంది.

ఈ-టికెటింగ్ సదుపాయాన్ని పునరుద్ధరించడంతో కాసేపటికి సాధారణ పరిస్థితికి వచ్చింది. పర్యాటకుల తాకిడి పెరగడంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ప్రతిరోజూ 3వేల మంది పర్యాటకుల ప్రవేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి రోజూ 10వేల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు.

Read Also : iPhones SIM slot : 2022లో సిమ్ కార్డు స్లాట్ లేకుండానే ఐఫోన్ మోడల్స్.. కాల్స్ చేసుకునేదెలా?