Encounter : జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్…ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీరులో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ ప్రాంతంలో భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు....

Encounter : జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్…ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హతం

Encounter

Updated On : October 10, 2023 / 8:12 AM IST

Encounter : జమ్మూకశ్మీరులో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ ప్రాంతంలో భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మంగళవారం తెల్లవారుజామున షోపియాన్‌లోని అల్షిపోరా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైనట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదులను మోరిఫత్ మక్బూల్, జాజిమ్ ఫరూఖ్, అలియాస్ అబ్రార్ గా గుర్తించారు. ఈ ఎదురుకాల్పుల గురించి జమ్మూకశ్మీర్ పోలీసులు ఎక్స్ లో పోస్టు చేశారు.

Also Read :

కాశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ హత్యలో ఈ ఉగ్రవాదుల హస్తం ఉందని కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి నెలలో సంజయ్ శర్మను లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఎదురుకాల్పుల అనంతరం జమ్మూకశ్మీర్ పోలీసులు, కేంద్ర బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని అచన్ ప్రాంతంలో బ్యాంక్ సెక్యూరిటీ గార్డు సంజయ్ శర్మను ఉగ్రవాదులు కాల్చి చంపారు. స్థానిక మార్కెట్‌కు వెళుతుండగా శర్మపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తదుపరి చికిత్స నిమిత్తం అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.