Bulls Race Two Died : కర్ణాటక ఎడ్ల రేసులో విషాదం.. ఇద్దరు మృతి

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జరిగిన ఎడ్ల రేసులో విషాదం చోటుచేసుకున్నది. హోరీ హబ్బా అనే రెండు వేర్వేరు ఎడ్ల రేసులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలు శివమొగ్గ జిల్లాలోని షికారిపుర, జాడేలో చోటు చేసుకున్నాయి.

Bulls Race Two Died : కర్ణాటక ఎడ్ల రేసులో విషాదం.. ఇద్దరు మృతి

Bulls Race Two Died

Updated On : October 31, 2022 / 12:02 PM IST

Bulls Race Two Died : కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జరిగిన ఎడ్ల రేసులో విషాదం చోటుచేసుకున్నది. హోరీ హబ్బా అనే రెండు వేర్వేరు ఎడ్ల రేసులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలు శివమొగ్గ జిల్లాలోని షికారిపుర, జాడేలో చోటు చేసుకున్నాయి. మృతులు షికారిపురకు చెందిన ప్రశాంత్, సొరబా తాలూకాలోని జాడే గ్రామానికి చెందిన ఆదిగా గుర్తించారు.

ఎడ్ల పందేలు నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసు శాఖ అనుమతి తీసుకోలేదని సమాచారం. ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎడ్ల పోటీలను చూసేందుకు వచ్చిన ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. దీపావళి తర్వాత జరిపే హోరీ హబ్బా ఈవెంట్‌లో భాగంగా ఎడ్ల పందేలు నిర్వహిస్తారు.

Anand Mahindra : భారత్‌లో‘ఒరిజనల్ టెస్లా వాహనం’ఇదే.. పెట్రోలుతో పనిలేదన్న ఆనంద్ మహీంద్రా..మస్క్ ఏమంటారో మరి..

ఎడ్ల రేసులు నిర్వహించేందుకు నిర్వాహకులు అనుమతి తీసుకోలేదని శివమొగ్గ ఎస్పీ మిథున్ కుమార్ చెప్పారు. రెండు సంఘటనల గురించి పోలీసులకు ఎటువంటి సమాచారం లేదన్నారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారని కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర పేర్కొన్నారు.