ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రైళ్లు! : అప్పుడేం జరిగిందంటే..

రైల్వే అధికారులు నిర్లక్ష్యం..వారి మధ్య సమాచార లోపం వెరసి రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా వచ్చిన ఘటన జరిగింది. మదురై-విరుదునగర్‌ సెక్షన్‌లో ఒకే ట్రాక్‌పై రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఎదురె దురుగా వచ్చాయి.

ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రైళ్లు! : అప్పుడేం జరిగిందంటే..

Trains Oppsite Direction

Updated On : September 25, 2021 / 4:16 PM IST

రైల్వే అధికారులు నిర్లక్ష్యం..వారి మధ్య సమాచార లోపం వెరసి రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా వచ్చిన ఘటన జరిగింది. మదురై-విరుదునగర్‌ సెక్షన్‌లో ఒకే ట్రాక్‌పై రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఎదురె దురుగా వచ్చాయి. ఈ రెండు ఢీకొంటే జరిగే ప్రమాదాన్ని ఊహించేందుకు భయం వేస్తుంది. కానీ ఈ ప్రమాదాన్ని చివరి నిమిషంలో  గుర్తించిన అధికారులు కంగారు పడ్డారు. వెంటనేతేరుకున్నారు. రెండు రైళ్లను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

మదురై -సెంగోట్టై ప్యాసింజర్‌ రైలు గురువారం (మే 9,2019)  సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో తిరుమంగళం రైల్వే స్టేషన్‌కు చేరుకోవటం కొంతసేపటికే ఆ రైలుకు స్టేషన్ మాస్టర్ అధికారులు సిగ్నల్‌ ఇవ్వటంతో తిరుమంగళం నుంచి బయలుదేరింది. పైగా అది సింగిల్ ట్రాక్. ఈ క్రమంలో సెంగోట్టై నుంచి మదురై వైపు అదే ట్రాక్‌పై మరో ప్యాసింజర్‌ రైలు దూసుకువస్తోంది.

సింగిల్ ట్రాక్ కావటంతో సెంగోట్టై వెళ్లవలసిన రైలుని తిరుమంగళంలోనే నిలిపివేయాలి. కానీ.. అధికారులు  సిగ్నల్‌ ఇవ్వడంతో ఈ రైలు బయలుదేరటంతో అదే ట్రాక్ పై వస్తున్న మరో ప్యాసింజర్ రైలును ఢీకొనే ప్రమాద స్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని గ్రహించిన రైల్వే అధికారులు వెంటనే రెండు రైళ్ల లోకో పైలట్లకు రైళ్లు నిలిపివేయాలని ఇన్ఫర్ మేషన్ ఇచ్చారు. దాంతో రెండు రైళ్లను నిలిపివేశారు. పెను ప్రమాదం తప్పిటంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. కానీ ఈ అంశంపై విచారణ చేపట్టారు  ఉన్నతాధికారులు.తిరుమంగళం, కల్లిగుడి స్టేషన్‌ మేనేజర్ల మధ్య సమాచార లోపం ఈ పరిస్థితి తలెత్తినట్టు అధికారుల విచారణలో తెలిసింది. దీంతో డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన కల్లిగుడి, తిరుమంగళం స్టేషన్‌ మాస్టర్లు సహా ముగ్గురిని అధికారులు సస్పెండ్‌ చేశారు.