Petrol Price Hike: ఆగని పెట్రో బాదుడు.. సెంచరీ దాటిన డీజిల్!
పెట్రోల్ ధరలు సెంచరీ దాటినా పరుగులు మాత్రం ఆగడంలేదు. పెట్రోల్ బాటలో డీజిల్ కూడా సెంచరీ కొట్టేసింది. దేశంలో ఇంధన ధరలు అత్యధికంగా ఉండే రాజస్థాన్‌లోని గంగానగర్‌లో డీజిల్ ధర వారం కిందటే రూ.100 దాటేయగా.. అక్కడ ఇప్పుడు లీటరు పెట్రోలు రూ.109.30, డీజిల్ రూ.101.85 చొప్పున ఉంది. ఇక నేడు పెట్రోల్ ధరలను చమురు కంపెనీలు మరోసారి పెంచాయి.

Petrol Price Hike
Petrol Price Hike: పెట్రోల్ ధరలు సెంచరీ దాటినా పరుగులు మాత్రం ఆగడంలేదు. పెట్రోల్ బాటలో డీజిల్ కూడా సెంచరీ కొట్టేసింది. దేశంలో ఇంధన ధరలు అత్యధికంగా ఉండే రాజస్థాన్‌లోని గంగానగర్‌లో డీజిల్ ధర వారం కిందటే రూ.100 దాటేయగా.. అక్కడ ఇప్పుడు లీటరు పెట్రోలు రూ.109.30, డీజిల్ రూ.101.85 చొప్పున ఉంది. ఇక నేడు పెట్రోల్ ధరలను చమురు కంపెనీలు మరోసారి పెంచాయి. ఆదివారం పెట్రోల్ పై రూ.36 పైసలు.. డీజిల్ పై రూ.26 పైసలు ధరలు పెరగగా దీంతో చాలా ప్రాంతాల్లో డీజిల్ సెంచరీ కొట్టేసింది.
ఇక మన తెలుగు రాష్ట్రాలలో ఏపీలో పలుచోట్ల లీటరు పెట్రోలు ధరలు రూ.105 పైనే ఉన్నాయి. శనివారం చిత్తూరు జిల్లా కుప్పంలో లీటరు డీజిల్ రూ.100.07 కాగా ఇక్కడ పెట్రోలు ధర రూ.106.25కి చేరింది. ఇక్కడే కాదు.. పలు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ పెట్రోలు ధర రూ.105 దాటేయగా.. డీజిల్ రూ.100కి చేరువగా వచ్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మొదలైన ధరల పెరుగుదల ఇప్పటికీ పైపైకి వెళ్తూనే ఉంది. ఎన్నికల అనంతరం సామాన్యులకు ధరల వాతలు పెడుతున్న చమురు కంపెనీలు ఆదివారం మరోసారి ధరలు పెంచాయి. దీంతో చమురు ధరలు ఆల్ టైం రికార్డు స్థాయికి చేరాయి.