US President Joe Biden: కొవిడ్ నెగిటివ్ వచ్చింది..! బైడెన్ భారత పర్యటనకు లైన్ క్లియర్.. కానీ, ఆ నిబంధనలు పాటిస్తారట..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి, ప్రథమ మహిళ జిల్ బైడెన్ కొవిడ్ భారిన పడ్డారు. ఆమెకు వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అగ్రరాజ్య అధ్యక్ష భవనం శ్వేతసౌధం వెల్లడించింది. దీంతో..

US President Joe Biden: కొవిడ్ నెగిటివ్ వచ్చింది..! బైడెన్ భారత పర్యటనకు లైన్ క్లియర్.. కానీ, ఆ నిబంధనలు పాటిస్తారట..

PM modi and US President Joe Biden

Updated On : September 6, 2023 / 11:51 AM IST

Joe Biden G20 Summit Delhi: ప్రపంచ ఆర్థిక సవాళ్లపై చర్చించే జీ-20 సదస్సుకు సర్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్ భారత్ మండపంలో G20 శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచ దేశాధినేతలు G20 శిఖరాగ్ర సమావేశాలకు వస్తుండటంతో ప్రభుత్వం పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసింది. ఈ సదస్సులో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో సహా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్ దేశాలకు చెందిన ప్రధానులు, అధ్యక్షులతో పాటు పలు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గోనున్నారు. అమెరికా అధ్యక్షుడు ఈనెల 7న ఢిల్లీకి చేరుకుంటారు. కొద్దిరోజులుగా జో బైడెన్ జీ20 సమావేశాల్లో పాల్గొనే విషయంపై సందేహాలు వ్యక్తం అయ్యాయి. కానీ, శ్వేతసౌధం జో బైడెన్ భారత్ పర్యటనపై అధికారిక ప్రకటన వెల్లడించింది.

G20 Summit : జి20 సదస్సు సందర్భంగా ఢిల్లీకి రైల్వే పార్శిల్ సర్వీసు నిలిపివేత

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి, ప్రథమ మహిళ జిల్ బైడెన్ కొవిడ్ భారిన పడ్డారు. ఆమెకు వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అగ్రరాజ్య అధ్యక్ష భవనం శ్వేతసౌధం వెల్లడించింది. దీంతో.. భారత్ అధ్యక్షతన ఢిల్లీ వేదికగా ఈనెల 9, 10 తేదీల్లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ హాజరయ్యే విషయంపై సందేశాలు నెలకొన్నాయి. అయితే, ఆయన సోమవారం కొవిడ్ పరీక్ష చేయించుకోగా నెగిటివ్‌గా వచ్చింది. మరోసారి మంగళవారంసైతం బైడెన్ కొవిడ్ పరీక్ష చేయించుకున్నారని, మళ్లీ నెగిటివ్‌గానే వచ్చిందని శ్వేతసౌధం తెలిపింది. దీంతో జోబైడెన్ భారత్ పర్యటనకు రూట్ క్లియర్ అయింది. అయితే, ఈ పర్యటనలో భాగంగా బైడెన్ కొవిడ్ మార్గదర్శకాలను పూర్తిగా పాటిస్తారని, మాస్క్‌లో కనిపిస్తారని తెలిపింది.

Delhi G20 Summit : ఢిల్లీలో జి 20 సదస్సును అడ్డుకోండి…ఖలిస్థానీ వేర్పాటువాది సంచలన ఆడియో సందేశం

జీ20 సమావేశాలకు హాజరుకానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం ఢిల్లీకి చేరుకుంటారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. ఆ తరువాత రెండు రోజులు జీ20 సమావేశాల్లో పాల్గొంటారు. అయితే, ఈ జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరు కావటం లేదు. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వస్తున్నారని తెలిసింది. మరోవైపు ఐరాపా యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లియోన్ వచ్చేదీ లేనిదీ ఇంకా క్లారిటీ రాలేదు.