Uttar Pradesh 2022 : యూపీ నా అడ్డా అంటున్న యోగీ.. మెజార్టీకి 15 పాయింట్స్
ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించిన యూపీలో మరోసారి బీజేపీ హవా కొనసాగింది. 37 ఏళ్ల యూపీ చరిత్రను సీఎం యోగి తిరగరాశారు...

Up Cm Yogi
Uttar Pradesh Election 2022 BJP Break 2017 Poll Record : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా భావించాయి పార్టీలు. మరోసారి కాషాయ జెండా రెపరెపలాడింది. ఐదు రాష్ట్రాల్లో (ఉత్తర్ ప్రదేశ్, గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్) జరిగిన ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో స్పష్టమైన మెజార్టీ సాధించింది బీజేపీ. ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించిన యూపీలో మరోసారి బీజేపీ హవా కొనసాగింది. 37 ఏళ్ల యూపీ చరిత్రను సీఎం యోగి తిరగరాశారు. యూపీ తన అడ్డా అని నిరూపించుకున్నారు. రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. భారీగా ఓట్ షేర్ సాధించింది ఈ పార్టీ. ఇక యోగి విషయానికి వస్తే.. తనదైన శైలీలో పాలన సాగిస్తూ.. మంచిమార్కులు సంపాదించారు. ప్రధానంగా ఇక్కడ ప్రతిపక్షం అనేది లేకుండా చేయడం, అభివృద్ధి కార్యక్రమాలు సాగిస్తూ ప్రజాదరణ పొందారు. దీంతో ఈ ఎన్నికల్లో మరోసారి బీజేపీకి పట్టం కట్టారు రాష్ట్ర ప్రజలు. ఈ రాష్ట్రంలో 403 అసెంబ్లీ స్థానాలున్నాయి.

Modi – Yogi
Read More : UP Congress : ప్చ్ ప్రియాంక..! కాంగ్రెస్ ఓటమికి కారణాలివే..!
ఇక యోగి విషయానికి వస్తే…ఆయన ప్లస్ పాయింట్ పరిశీలిస్తే..
1. యోగీ నాయకత్వ సామర్థ్యం
2. మిస్టర్ క్లీన్ ఇమేజ్
3. స్థిరమైన ప్రభుత్వం
4. హిందుత్వ అంశం
5. వివాదాస్పద భూమి రామజన్మభూమికి దక్కడం
6. రామాలయ నిర్మాణం
7. కాశీ కారిడార్ నిర్మాణం

Yogi Lunch
Read More : Modi- Yogi : యూపీలో చరిత్ర తిరగరాసిన బీజేపీ.. మోదీ-యోగీ డబుల్ ధమాకా
8. అభివృద్ధి కార్యక్రమాలు
9. రోడ్లు, ఇతర మౌలికసదుపాయాల అభివృద్ధి
10. సంక్షేమ పథకాలు
11. అమిత్ షా వ్యూహాలు
Read More : Punjab CM Charanjit Singh: రాజీనామాకు సిద్ధమైన పంజాబ్ సీఎం

Up Modi – Yogi Win
12. ప్రధాని మోదీ ఆకర్షణ
13. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే వ్యూహాలు
14. ప్రతిపక్షం బలంగా లేకపోవడం
15. వ్యవసాయ చట్టాల రద్దు
Read More : Punjab Election Results 2022: పంజాబ్ లో టాప్ లేపుతున్న ‘ఆప్’..స్థానిక పార్టీలను ఊడ్చిపారేస్తోంది
2022, మార్చి 10వ తేదీ గురువారం ఉదయం ఈవీఎంలను తెరచి కౌంటింగ్ ప్రారంభించారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించారు. యూపీలో కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ అధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది. ప్రత్యర్థి పార్టీకి ఏ మాత్రం అందనంతగా దూసుకపోయింది. 403 సీట్లు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 202గా ఉంది. బీజేపీ ఏకంగా 266 సీట్లలో అధిక్యం కనబరుస్తోంది. 125 స్థానాల్లో ఎస్పీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తంగా రెండోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకొనే దిశగా బీజేపీ దూసుకెళ్తోంది.