నా కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారు

భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మాతృభాష పరిరక్షణకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలపై అందుకోసం ప్రజలు ఒత్తిడి తేవాలంటూ ఆయన కోరారు. సొంత జిల్లా నెల్లూరులో పర్యటిస్తున్న వెంకయ్య నాయుడు వెంకటాచలంలో విలేఖరులతో మాట్లాడారు. మాతృభాష అభివృద్ధికి ప్రతీ పౌరుడు కృషి చేయవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే తన కుటుంబ సభ్యుల్లో ఎవరూ రాజకీయాల్లోకి రాబోరని వెంకయ్య నాయుడు స్పష్టంచేశారు.
Read Also: హక్కులను కాలరాస్తున్నారు: కేంద్రంపై కేసీఆర్ గుస్సా
స్వర్ణభారత్ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేపడతారని ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఐదు అంశాలతో ప్రజల్లోకి వెళ్తానని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పర్యటించి యువకుల్లో స్ఫూర్తి నింపుతానని అన్నారు. శాస్త్రవేత్తల పరిశోధనలు పరిశీలిస్తానని, దేశానికి వెన్నెముకగా ఉన్న రైతుల వద్దకు వెళ్లి వారికి ఏమి చేయాలనే విషయమై అడిగి తెలుసుకుంటానని అన్నారు. భారత దేశ సంస్కృతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తానని వెల్లడించారు.
Read Also: బాలకృష్ణ తప్పు అదేనట.. వర్మ పెట్టిన సంచలన వీడియో!
Read Also: ఏపీలో వచ్చేది జగన్ ప్రభుత్వమే : కేటీఆర్ జోస్యం