ట్విట్టర్‌లో రచ్చ : మల్టీఫ్లెక్స్‌లో జాతీయగీతం.. లేచి నిలబడలేదని లొల్లి!

  • Published By: sreehari ,Published On : October 30, 2019 / 07:58 AM IST
ట్విట్టర్‌లో రచ్చ : మల్టీఫ్లెక్స్‌లో జాతీయగీతం.. లేచి నిలబడలేదని లొల్లి!

Updated On : October 30, 2019 / 7:58 AM IST

మల్టీఫ్లెక్సుల్లో సినిమా ప్రారంభంలో జాతీయ గీతాన్ని ఆలపించడం కామన్. థియేటర్లలో కూర్చొన్న ప్రేక్షకులు వెంటనే లేచి జాతీయగీతం పూర్తియ్యే వరకు నిలబడి తమ దేశభక్తిని చాటుకుంటారు. బెంగళూరుకు చెందిన ఓ కుటుంబానికి సినిమా థియేటర్లలో చేదు అనుభవం ఎదురైంది. థియేటర్ లో జాతీయగీతం ఆలపన సమయంలో లేచి నిలబడలేదు. దీంతో అక్కడి మిగతా ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ గీతం పట్ల గౌరవం లేదా అని ఆ కుటుంబాన్ని ఏకిపారేశారు. 

సీట్లో కూర్చొని ఉన్న కుటుంబ సభ్యులను పాకిస్థాన్ తీవ్రవాదులు అంటూ చెడుగుడు ఆడేశారు. గ్రూపు సభ్యులంతా కలిసి కుటుంబాన్ని మాటలతో బెదరగొట్టారు. వీరిలో కన్నడ నటులైన ఐశ్వర్య, అరుణ్ గౌడ కూడా ఉన్నారు.

ఈ ఘటన బెంగళూరులోని మల్లేశ్వరంలో PVR ఒరియన్ మాల్ మల్టీఫ్లెక్స్ లో ధనుష్ నటించిన అసురన్ తమిళ్ మూవీ వీక్షిస్తున్న సమయంలో జరిగింది. ఈ ఘటనను బీవీ ఐశ్వర్య.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ ట్విట్టర్ లో కామెంట్లు పెడుతున్నారు.