Kind man viral video : సింహానికి మంచినీళ్లు తాగించిన వ్యక్తి.. అతని ధైర్యాన్ని మెచ్చుకున్న నెటిజన్లు
సింహాన్ని కాస్త దూరం నుంచి చూడటానికే భయపడతాం. అలాంటిది దానికి మంచినీళ్లు తాగించడం అంటే ఎంత ధైర్యం ఉండాలి. దాహంతో ఉన్న ఓ సింహానికి ఓ వ్యక్తి బాటిల్ తో మంచినీరు పట్టించాడు. అతని ధైర్యానికి, దయాగుణానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.

Kind man viral video
Kind man viral video : పక్షులకు, హాని చేయని జంతువులకు మంచినీరు అందించడానికి ఆలోచించం. కానీ ప్రమాదకర జంతువులను దగ్గర నుంచి చూడటానికి కూడా భయపడతాం. కానీ ఓ వ్యక్తి సింహానికి బాటిల్‌తో మంచినీరు పట్టించి దాహం తీర్చాడు. అతని ధైర్యానికి, దయగల మనస్తత్వానికి నెటిజన్లు ఫిదా అయ్యారు.
Shiva Karthikeyan : సింహాన్ని పెంచుకోబోతున్న తమిళ్ హీరో శివ కార్తికేయన్.. లిస్ట్‌లో ఇది రెండో సింహం!
సింహం ప్రమాదకరమైన జంతువు. ఒక్కసారిగా మనుష్యులపై తెగబడి దాడి చేసి ప్రాణాలు తీస్తాయి. వాటికి ఎదురుపడటమంటే పెద్ద సాహసమే. ఇక వాటికి దగ్గరుండి నీరు పట్టించడమంటే ఎంత రిస్క్ ఆలోచిచండి. కానీ ఓ వ్యక్తి రిస్క్ తీసుకున్నాడు. దాహంతో ఉన్న బాటిల్‌తో మంచినీరు తాగించాడు. ఈ వీడియో ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద (@susantananda3) ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఈ గ్రహం మీద మ్యాజిక్ ఉంటే, అది నీటిలో ఉంటుంది’ అనే క్యాప్షన్‌తో ఆయన ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆందోళన, ఆశ్చర్యంతో కూడిన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
Buffalo fight On Lions : సింహం సింగిల్‌గా కాదు గుంపుగా వచ్చినా చుక్కలు చూపించిన గేదె..
‘అందమైన వీడియో’ అని ఒకరు.. ‘మేము ప్రకృతిలో భాగం.. ఇది ఒకరికొకరు నమ్మకానికి ప్రతిరూపం’ అని మరొకరు కామెంట్ చేశారు. అయితే జంతువులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో అర్ధం కాదు. అలాంటి వాటిపై దయ చూపించాలంటే కాస్త జాగ్రత్త కూడా అవసరం. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణాలు తీసేస్తాయి. అయినా ఆ వ్యక్తి సింహం దాహాన్ని తీర్చడానికి తన ప్రాణాలకు తెగించడాన్ని ప్రజలు మెచ్చుకున్నారు.
“If there is magic on this planet, it is contained in water.” pic.twitter.com/ORw4lZDr7L
— Susanta Nanda (@susantananda3) June 29, 2023