‘Gods On Currency’: కరెన్సీపై లక్ష్మీదేవి, గణేశుడి బొమ్మలు ఉండాలని చేసిన డిమాండుకు ప్రజల నుంచి భారీగా మద్దతు వచ్చింది: కేజ్రీవాల్
భారత కరెన్సీపై లక్ష్మీదేవి, గణేశుడి బొమ్మలు ఉండాలని తాను నిన్న చేసిన డిమాండుకు ప్రజల నుంచి భారీగా మద్దతు వచ్చిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కరెన్సీపై లక్ష్మీదేవి, గణేశుడి బొమ్మలు ఉండాలని కోరిన కేజ్రీవాల్.. ఇవాళ దీనిపై ప్రధాన మంత్రి నరంద్ర మోదీకి లేఖ రాశారు. 130 కోట్ల మంది భారతీయుల తరఫున తాను ఈ వినతి చేస్తున్నారని చెప్పారు.

BJP gave nothing to Delhi except mountains of garbage says Kejriwal
‘Gods On Currency’: భారత కరెన్సీపై లక్ష్మీదేవి, గణేశుడి బొమ్మలు ఉండాలని తాను నిన్న చేసిన డిమాండుకు ప్రజల నుంచి భారీగా మద్దతు వచ్చిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కరెన్సీపై లక్ష్మీదేవి, గణేశుడి బొమ్మలు ఉండాలని కోరిన కేజ్రీవాల్.. ఇవాళ దీనిపై ప్రధాన మంత్రి నరంద్ర మోదీకి లేఖ రాశారు. 130 కోట్ల మంది భారతీయుల తరఫున తాను ఈ వినతి చేస్తున్నారని చెప్పారు.
‘‘మన దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నప్పటికీ భారత్ ఓ అభివృద్ధి చెందుతున్న, పేద దేశంగానే ఉంది. దేశ పౌరులు శ్రమించి పనిచేయాల్సి ఉన్నప్పటికీ మన ప్రయత్నాలు సఫలం కావాలంటే మనకు దేవుడి అనుగ్రహం ఉండాలి’’ అంటూ హిందీలో కేజ్రీవాల్ లేఖ రాశారు. దీన్ని కేజ్రీవాల్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కరెన్సీపై లక్ష్మీదేవి, గణేశుడి బొమ్మలు ఉండాలని తాను చేసిన డిమాండును వీలైనంత త్వరగా అమలు చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని చెప్పారు.
కాగా, ముస్లిం దేశమైన ఇండొనేషియాలో కరెన్సీపై గణేశుడి బొమ్మ ఉంటుందని, మరి మన కరెన్సీపై ఎందుకు ఉండకూడదని నిన్న కేసీఆర్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. అమెరికా డాలర్ తో పోల్చితే భారత రూపాయి మారకం విలువ రోజురోజుకీ క్షీణించిపోతోందని, దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచాలంటే మన ప్రయత్నాలు చేస్తూనే, సర్వశక్తిమంతుడైన భగవంతుడి అనుగ్రహాన్ని కూడా పొందాలని చెప్పారు.
मैंने प्रधानमंत्री जी को पत्र लिखकर 130 करोड़ भारतवासियों की ओर से निवेदन किया है कि भारतीय करेंसी पर महात्मा गांधी जी के साथ-साथ लक्ष्मी गणेश जी की तस्वीर भी लगाई जाए। pic.twitter.com/OFQPIbNhfu
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 28, 2022
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..