Rahul Gandhi: గంటలలోనే హామీలు చట్టాలు అవుతాయి.. కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటు అనంతరం రాహుల్ గాంధీ
మేం ఎన్నికల్లో ఐదు హామీలు ఇచ్చాం. మేము తప్పుడు హామీలు ఇవ్వలేదని మేము చెప్తున్నాం. మేము ఏం చెప్పామో అది చేస్తాం. మరో గంట-రెండు గంటల్లో కర్ణాటక మంత్రివర్గ మొదటి క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. మేం ఎన్నికల్లో ఇచ్చిన ఐదు హామీలు ఈ సమావేశంలోనే చట్టరూపం దాల్చుతాయి

Karnataka: ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ పార్టీ ఇచ్చిన ఐదు ప్రధాన హామీలు మొదటి క్యాబినెట్ సమావేశంలోనే చట్టాలుగా మారుతాయని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారమయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ సహా ఎనిమిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాహుల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరికొద్ది సేపట్లో కర్ణాటక కేబినెట్ సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను చట్టరూపం దాలుస్తుండడం గమనార్హం.
Rajasthan : ప్రభుత్వ కార్యాలయంలో రూ.2 వేల నోట్ల గుట్టలు, బంగారం కడ్డీలు .. అధికారులు షాక్
‘‘మేం ఎన్నికల్లో ఐదు హామీలు ఇచ్చాం. మేము తప్పుడు హామీలు ఇవ్వలేదని మేము చెప్తున్నాం. మేము ఏం చెప్పామో అది చేస్తాం. మరో గంట-రెండు గంటల్లో కర్ణాటక మంత్రివర్గ మొదటి క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. మేం ఎన్నికల్లో ఇచ్చిన ఐదు హామీలు ఈ సమావేశంలోనే చట్టరూపం దాల్చుతాయి. మేము మీకు నిష్పక్షపాతమైన పాలన అందిస్తాం. అవినీతికి ఏమాత్రం తావు ఇవ్వము’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
MLA Anil Kumar Yadav: ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే.. పై నుంచి కింది దాకా వలిచేస్తా
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆయనకు డిప్యూటీగా (ఉప ముఖ్యమంత్రి) డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని బెంగళూరలోని కంఠవీర స్టేడియంలో వీరి చేత గవర్నర్ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక వీరితో పాటు ఎనిమిది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. జి. పరమేశ్వర్ (ఎస్సీ), కేహెచ్ మునియప్ప (ఎస్సీ), కేజే జార్జ్ (మైనార్టీ – క్రిస్టియన్), ఎంబీ పాటిల్ (లింగాయత్), సతీష్ జార్కిహోళి (ఎస్టీ – వాల్మీకి), ప్రియాంక్ ఖర్గే (ఎస్సీ), రామలింగారెడ్డి (రెడ్డి), బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ (మైనార్టీ -ముస్లీం)లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం.. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.